ఏపీ: వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట.. ఏం జరిగిందంటే..?
అయితే ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు సైతం వీరికి కాస్త ఊరట కలిగించింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ కి గతంలో ముందస్తు బయల్ని నిరాకరించింది దీంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఈ వైసీపీ నేతలకు వారి యొక్క పిటిషన్ విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు వీరికి రక్షణ కల్పించాలంటూ సూచించింది. అలాగే మరొకవైపు దేవినేని అవినాష్ జోగి రమేష్ ఇద్దరూ కూడా ఈ కేసుకు సహకరించాలంటూ కోర్టు తెలియజేసింది. వీరిద్దరి పాస్పోర్టులను కూడ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు సమాచారం.
వైసీపీ నేతలు తరఫున సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.. ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించడం జరిగింది. ఈ తదుపరి కేసును నవంబర్ 4వ తేదీన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మందస్తు బెయిల్ పై నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు తేల్చబోతోంది. అయితే అప్పటివరకు వీరిని అరెస్ట్ చేయడానికి వీలు లేదని ఆదేశాలు కూడా జారీ చేసింది హైకోర్టు. టిడిపి కార్యాలయం దాడి కేసులో నిందితుడిగా దేవినేని అవినాష్ ఉండగా ,జోగి రమేష్ చంద్రబాబు నివాసం పైన దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.