తెలంగాణ బీజేపీలో ముసలం..రేవంత్‌ తో కలిసి ఎమ్మెల్యే కుట్రలు ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర బిజెపిలో... ముసలం నెలకొంది. మొన్నటి అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంకు సంపాదించుకున్న బిజెపి నేతల మధ్య తీవ్రమైన వివాదాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది చొప్పున.. సంపాదించుకున్న తెలంగాణ బిజెపి పార్టీలో ముసలం నెలకొంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయట. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు.. 8 దారులు చూసుకుంటున్నారట.
 

అంతేకాదు అసెంబ్లీలో అసలు వీరి మధ్య సఖ్యత లేదని సమాచారం. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి... సమావేశం పెడితే ఏ ఒక్క ఎమ్మెల్యేలు వెళ్లడం లేదట. అయితే బిజెపిలో ఈ పరిస్థితి ఉండడానికి కారణం కేవలం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని చెబుతున్నారు. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బిజెపిలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి...ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది.
 

దీంతో ఎల్పి పదవేని.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఇచ్చింది అధిష్టాణం. మహేశ్వర్ రెడ్డి కి మంచి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆ పదవి ఇవ్వగలిగింది బీజేపీ.  అయితే మహేశ్వర్ రెడ్డి కి బిజెపి ఎల్పీ లీడర్ పదవి  ఇవ్వడంపై మిగతా ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు తీవ్ర వ్యతిరేకత  చూపిస్తున్నారట. ఆయనను ఆ పదవి నుంచి తీసేయాలని అనుకుంటున్నారట. అయితే... రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మహేశ్వర్ రెడ్డి చేతులు కలిపారని.. బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఆరోపణలు చేస్తున్నారు.
 

అసలు సిసలు బీజేపీ వాది మహేశ్వర్ రెడ్డి కాదని... అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఆరోపణలు చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారని అంటున్నారు. అలాంటి నేతను వాటి నుంచి వెలివేయాలని... బిజెపి నేతలు చెబుతున్నారట. మహేశ్వర్ రెడ్డి కి వ్యతిరేకంగా సంతకాలు చేసి మరి అధిష్టానానికి.. ఫిర్యాదు చేశారట తెలంగాణ బిజెపి నేతలు.  మరి బిజెపి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: