హ్యాట్సాఫ్ చంద్రన్న: 'డియస్సీ'ల నిర్వహణలో చంద్రన్న తర్వాతే అనేలా మెగా డియస్సీ ప్రకటన.!

FARMANULLA SHAIK
* కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీకి పెద్దపీట.!
* డియస్సీ అనగానే టక్కున గుర్తొచ్చే సీఎం.!
* మెగాడిఎస్సి నోటిఫికేషన్ తో లక్షల మంది అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు.!
* ఏదేమైనా పరీక్షల నిర్వహణకు భారీ కసరత్తు.!
(ఏపీ-ఇండియాహెరాల్డ్): ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులుకానుంది.అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన అంశం మెగా డీఎస్సీ. దాదాపు నాలుగు లక్షల మంది డియస్సీ అభ్యర్థులు గత అయిదేళ్లుగా డియస్సీ నిర్వహించకపోవడంపై తీవ్ర నిరాశతో గత వైసీపీ ప్రభుత్వాన్ని దించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.అయితే దీన్ని గమనించిన చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తన మొదటి సంతకం మెగా డియస్సీపైనే చేస్తానని హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు ఇచ్చిన ఈ హామీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డియస్సీ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహన్ని నింపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక కారణం అయింది. అయితే అనుకున్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పధకాలతో అలాగే గత వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 164 స్థానాలు గెలిచి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది.
అయితే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం మెగా డియస్సీ  దస్త్రంపైనే పెట్టడం నిరుద్యోగుల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగించింది.అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు.అయితే డియస్సీ విషయానికి వస్తే గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీని రద్దు చేసి కూటమి ప్రభుత్వం కొత్తగా మెగా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెల్సిందే.ఈ మెగా డీఎస్సీలో భాగంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ జరగనుంది. కేటగిరిల వారీగా పోస్టుల వివరాలను చుస్తే ఎస్జీటీ :6,371, పీఈటీ : 132, స్కూల్ అసిస్టెంట్స్: 7725, టీజీటీ: 1781, పీజీటీ: 286, ప్రిన్సిపల్స్: 52 పోస్ట్లు ఉన్నాయి.అయితే దాంట్లో భాగంగానే ప్రభుత్వం ముందు టెట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆంధ్రప్రదేశ్లో టెట్ మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఈ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు అభ్యర్థుల నుండి సమయం కావాలని విజ్ఞప్తులు రావడంతో టెట్ కు మూడు నెలలు, డియస్సీకి మరో మూడు నెలల సమయం ప్రభుత్వం ఇచ్చింది.అయితే టెట్ పరీక్షలకు సెప్టెంబర్ నెల 22 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేలా అక్టోబర్ 3 నుండి పరీక్షలు నిర్వహించి నవంబర్-3 న ఫలితాలు ఇచచ్చే విజన్తో ప్రభుత్వం దూసుకుపోతుంది.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా విజయవాడ వరదలు తీవ్రంగా ఆ నగర వాసులను ప్రభావితం చేసాయి.అలాగే ఒక వైపు టెట్ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండడంతో సోషల్ మీడియాలో టెట్ వాయిదా అంటూ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. కానీ దీనిపై ప్రభుత్వంకానీ అధికారులు కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంచేపట్టినాక మెగా డియస్సీ నిర్వహణ అనేది ఒక పెద్ద అంశంగా పరిగణలోకి తీసుకోవడంతో టెట్ వాయిదాపడే అవకాశం లేదని తెలుస్తుంది.ఎంత తొందరగా టెట్ పూర్తి చేసి వెంటనే డియస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి/మార్చ్ లో డియస్సీ పరీక్షలు నిర్వహించి వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు తెరిచేలోపు ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలనీ ప్రభుత్వం భావిస్తుంది. అలా చేయని యెడల అభ్యర్థులు నుండి తీవ్ర విమర్శలు కూటమి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే అదునుగా చేసుకొని వైసీపీ ప్రభుత్వం డియస్సీ లేదు సూపర్ సిక్స్ లేదూ అంటూ అగ్నికి ఆజ్యం పోసినట్లు డియస్సీ నిరుద్యోగుల్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టే అవకాశం ఉంది కనుక టెట్ మరియు డియస్సీ వాయిదా అనే అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టి పరీక్షలు షెడ్యూల్డ్కి అనుగుణంగా జరపాలనీ ప్రభుత్వం భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: