పది గ్రామాలకు సాయం చేసిన రియల్ హీరోయిన్ నిహారిక.. గొప్ప మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

Reddy P Rajasekhar
మెగా డాటర్ నిహారిక తాజాగా మంచి మనస్సును చాటుకోవడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు మెగా డాటర్ నిహారిక 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. 5 లక్షల రూపాయల మొత్తం తక్కువే కావచ్చు కానీ నిహారిక చేసిన సహాయం మాత్రం తక్కువేం కాదు. మెగా ఫ్యామిలీ ఇప్పటికే 9.4 కోట్ల రూపాయలు విరాళంగా అందించగా నిహారిక చేసిన సహాయంతో ఆ మొత్తం 9.45 కోట్ల రూపాయలకు పెరిగింది.
 
బుడమేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో ఎన్నో గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండటం నాకు చాలా బాధ కలిగించిందని ఆమె అన్నారు. ఇటువంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలేనని ఆమె పేర్కొన్నారు. నేను పుట్టి పెరిగింది సిటీలోనే అయినా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే అని ఆమె అన్నారు.
 
పెద్దల అనుభవాల దృష్ట్యా గ్రామీణ వాతావరణంపై నాకు ఎంతో అభిమానం ఏర్పడిందని నిహారిక చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు మా కుటుంబీకులు అందరూ వరద బాధితులకు అండగా నిలవడం సంతోషాన్ని కలిగించిందని నిహారిక కామెంట్లు చేశారు. ఉడతా భక్తిగా వరద ముంపునకు గురైన పది గ్రామాలకు గ్రామానికి 50,000 రూపాయల చొప్పున ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నానని నిహారిక పేర్కొన్నారు.
 
ఈ విపత్కర పరిస్థితులు త్వరగా తొలగిపోవాలని ప్రజలు సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే నిహారిక గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నిహారిక సాయం చేయాల్సిన అవసరం లేకపోయినా సాయం చేసి మంచి మనస్సును చాటుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిహారిక ప్రతిభను, మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: