రేవంత్ రెడ్డి కొంపముంచిన హైడ్రా.. ఇక కాపాడడం కష్టమే ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ... ప్రజలకు దూరమవుతోంది. ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారంటీలు ప్రకటించి... కేవలం ఉచిత బస్సు... మాత్రమే అమలు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. అది కూడా అరకోరా బస్సులతో నడుపుతోందని గులాబీ పార్టీ ఆరోపణలు చేయడం జరుగుతుంది.
అయితే... ఇలాంటి నేపథ్యంలోనే... రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా  ను రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకువచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ హైడ్రా సంస్థ బాధ్యతలను మొత్తం రంగనాథ్ కు అప్పగించారు. దీంతో చార్జ్ తీసుకున్న రంగనాథ్... అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ నుంచి... పేద ప్రజల ఇండ్ల వరకు అందరివి... ధ్వంసం చేస్తున్నారు.
నోటీసులు ఇచ్చి... చెరువులపై అలాగే నాళాలపై అక్రమంగా కట్టిన కట్టడాలను  ధ్వంసం చేస్తున్నారు. అయితే 1975 ఆ సంవత్సరకాలం... హైదరాబాద్ పరిమాణం బట్టి... ఈ కూల్చివేతలు జరగడం వివాదంగా మారింది. దీంతో.. కొంతమంది అమాయక ప్రజల ఇండ్లు కూడా ధ్వంసం అవుతున్నాయి.
అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్ కు మరో ఊహించని ఎదురుదెబ్బ ఈ హైడ్రా ద్వారా ఎదురయింది.  హైడ్రాధికారులు రంగంలోకి దిగిన ఈ నెల రోజుల్లో... హైదరాబాద్ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది అంట. రిజిస్ట్రేషన్లు కూడా ఎవరు చేయించుకోవడం లేదట. దీంతో రేవంత్ రెడ్డి ఖజానా ఖాళీ అయినట్లు సమాచారం.  జూలై తో పోలిస్తే ఆగస్టులో... రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నష్టమే జరిగినట్లు సమాచారం.  హైదరాబాదులో ఇండ్లు అలాగే స్థలాలు కొనుగోలు చేయాలంటే భయపడుతున్నారట జనాలు. అందుకే ఈ పరిస్థితి నెలకొంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: