ఏపీ: చిన్నమ్మకు చెక్‌.. కొత్త బాస్‌ అతనే ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. బిజెపి పార్టీ పూర్తిగా.. పుంజుకుందని చెప్పవచ్చు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి లో భాగమైన బిజెపి పార్టీ.... మంచి స్థానాలను దక్కించుకుంది. అదే సమయంలో కేంద్ర ఇటు ఏపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా దక్కించుకుంది బిజెపి. అయితే ఇలాంటి నేపథ్యంలో బిజెపి పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఫోకస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
 

వైసిపి పార్టీ దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో... ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బిజెపి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే రెడ్డి నేతలను లాగేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల వైసిపి పార్టీకి రాజీనామా చేసిన  నేతలు అందరిని బిజెపిలోకి వచ్చేలా ప్లాన్ వేస్తోందట బిజెపి అధిష్టానం. ముఖ్యంగా రెడ్డి నేతలకు ప్రాధాన్యత ఇచ్చి వైసిపి పార్టీ ఇస్తానని భర్తీ చేయాలని అనుకుంటుందట.
ఇందులో భాగంగానే త్వరలోనే... ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని... వ్యూహాలు రచిస్తోందట.  ప్రస్తుతం పురందరేశ్వరి... బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. అయితే ఆమెకు టిడిపి మూలాలు ఉన్నాయని మొదటి నుంచి చాలామంది బిజెపి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆమెను మార్చాలని కూడా చాలామంది డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు బిజెపి లో ఉన్న రెడ్డి నేతకు... ఏపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని బిజెపి అధిష్టానం అనుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
 

ఏపీ బీజేపీలో చాలామంది రెడ్డి నేతలు ఉన్నారు. అలాగే వైసిపి నుంచి కూడా కొంతమందిని తెచ్చుకుంటున్నారు. అందులో ఫైనల్ గా ఒకరిని సెలెక్ట్ చేసి... పురందరేశ్వరుని తొలగించనున్నారట. ఇక ఆమెకు... కేంద్రంలో కీలక పదవి ఇచ్చేందుకు కూడా బిజెపి నిర్ణయం తీసుకుందట.  ప్రస్తుతం ఆమె రాజమండ్రి ఎంపీగా పని చేస్తున్నారు. మన ఎన్నికల్లో బిజెపి తరఫున ఎంపిక గెలిచారు. అయితే ఏపీ అధ్యక్ష పదవి మళ్ళీ సోము వీర్రాజుకు ఇవ్వాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై బిజెపి అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: