గోదారమ్మ ఉగ్రరూపం.. భయం గుప్పెట్లో ఆ లంక గ్రామాలు..!!

murali krishna

* ఏటా జూలై నెలలో గోదావరికీ భారీ వరదలు
 
* ఏ క్షణాన ఏమి జరుగుతుందో అని నిత్యం భయం భయం..

* గోదారమ్మ ఉగ్రరూపానికి అలవాటు పడిన ఆ లంక గ్రామాలు..

తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విలయతాండవం ఆడుతుంది.ఊహించని విధంగా వరదలు, ముంచెత్తడంతో ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది..అనేక చోట్ల భారీ వర్షాలు కురవడంతో నగరాలు, పట్టణాల్లోని ప్రజలు అల్లాడిపోయారు. ఇలా ఎప్పుడో ఒకసారి వచ్చే వరదలకే ఇంత విద్వంసం జరిగితే గోదావరి తీరంలోని వందల కొద్ది లంక గ్రామాలకు ఏటా వరదలు పలకరించి వెళ్తుంటాయి.ఆ కుటుంబాలకు వరదలు అత్యంత మామూలు విషయం. అవి వారి జీవితంలో భాగం అయిపోయాయి..కొన్నిసార్లు వరద ఉధృతి తీవ్రంగా మారిన కూడా ఆ వరదలను ఎదుర్కొంటూ అక్కడి వాసులు జీవనం కొనసాగిస్తున్నారు.ప్రతి సంవత్సరం గోదావరి నదికి జులై మరియు ఆగస్టు మాసాల్లో వరదల సీజన్ ఉంటుంది.. ఇలా వరదలు వచ్చిన ప్రతిసారీ ఆ లంక గ్రామ వాసులు తమ పిల్లాపాపలతో సామాన్లు తీసుకుని ఒడ్డుకు చేరడం వారికి అలవాటుగా మారింది.కొన్నిసార్లు నెలలపాటు తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చేది…మళ్లీ తిరిగి వచ్చేసరికి ఇల్లు, ఇంట్లో సామాన్లు భద్రంగా ఉంటాయన్న ధీమా కూడా ఉండేది కాదు.అయితే గోదావరి నదీ ప్రవాహం పాపికొండల దిగువన భిన్నంగా ఉంటుంది. రాజమండ్రి వద్ద అఖండ గోదావరిగా మారుతుంది. ధవళేశ్వరం దిగువున గోదావరి పాయలుగా ప్రవహిస్తుంది. అయినా ప్రవాహపు పరిధి ఎక్కువగానే ఉంటుంది. దాంతో ఇసుక మేటలు ఏర్పడి క్రమంగా లంకలుగా పరిణామం చెందుతూ వస్తున్నాయి..


అయితే అదే సమయంలో, ప్రవాహపు వడి వేగానికి కొన్ని లంకలు కొట్టుకుపోవడం కూడా జరుగుతోంది.అలా వారు అక్కడ తమ ప్రాణాలు అరచేతిలో ఉంచుకొని బ్రతుకుతున్నారు..నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు దిగువన అలాంటి లంక గ్రామాలు చిన్నా, పెద్దా కలిపి సుమారుగా వందకు పైగా ఉన్నాయి.దాదాపుగా 4 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ ఎదురుగా రెండు రైలు వంతెనల చెంత, రెండు గ్రామాలు ఉంటాయి. అందులో ఒకటి బ్రిడ్జిలంక.
ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన ఉండడం వల్ల, మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవాహం రాగానే వారు తమ లంకను ఖాళీ చేయాల్సి ఉంటుంది. వరద హెచ్చరికలు రాగానే వీలైనంత మేరకు సరుకులు, పిల్లాపాపలతో పడవలపై నది దాటి ఒడ్డుకు చేరుతారు. వరద తాకిడి తగ్గగానే తిరిగి సొంత గూటికి చేరుకుంటారు.గోదావరి వరద హెచ్చరికల సమాచారం ఇప్పుడు బాగా అందుబాటులోకి వచ్చింది. కానీ 20 నుంచి 30 ఏళ్ల కిందట ఇలాంటి ముందస్తూ సమాచారం లేకపోవడంతో లంకల్లో ప్రాణనష్టం భారీగా ఉండేది. హఠాత్తుగా వచ్చిన వరదలతో రాత్రికి రాత్రే కొన్ని లంక గ్రామాలు మునిగిపోయేయి.1986 లో సమయంలో గోదావరి నదికి వచ్చిన వరదలు అప్పట్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: