భారీ వర్షాల దాటికి సమస్యల వలయంలో చిక్కుకున్న ఖమ్మం..!

Pulgam Srinivas
వర్షా కాలం వచ్చింది అంటే చాలు కొన్ని ప్రాంతాలలో ఎక్కువ శాతం వర్షాలు పడినట్లు అయితే ఆ వర్షాల కారణంగా వరదలు రావడం , ఆ వరదల కారణం గా అనేక మంది చనిపోవడం , కొంత మంది జీవితాలు చెల్లా చెదురు కావడం జరుగుతూ ఉంటాయి . ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రం లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కంటే కూడా ఖమ్మం జిల్లాలో భారీగా వర్ష పాతం నమోదు అవుతుంది.

దానితో ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలలో వరద ఉధృతంగా వస్తుంది. ఇక లోతట్టు ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలు అనేక కష్టాలను వరదల ద్వారా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా ఖమ్మం జిల్లాలో జరిగింది. ఇక ఇలా ఖమ్మం జిల్లాలో భారీగా వరదలు రావడం వల్ల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడి ప్రజలను వరద ముంపు నుంచి త్వరగా బయటపడేసేందుకు అనేక చర్యలను తీసుకుంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి ఆ ప్రాంతం మంత్రులు మరియు మరి కొంత మంది నేతలు కూడా ఖమ్మం జిల్లా పై ప్రత్యేక ఫోకస్ ను పెట్టి మరి చాలా తక్కువ సమయంలో వరద ద్వారా కష్టాలలో ఉన్న ప్రజలను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

ఇక ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులుగా ఉన్నారు. మరి వర్షాలు తగ్గు ముఖం పట్టాక ఖమ్మం జిల్లా ప్రజలు పూర్తిగా వరద దాటి నుండి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: