ఏపీ: వరద బాధితులకు జగన్ సాయం.. ఎంతంటే..?
ముఖ్యంగా తాను నిన్నటి పర్యటనలో వరద బాధితులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయానని అందుకే కోటి రూపాయలను సైతం తను నగదుగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.అయితే అది ఏ రూపంలో ఇవ్వాలన్నది పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే ఇవ్వబోతున్నట్లుగా తెలియజేశారు. ఇక చంద్రబాబు విజయవాడలో కేవలం షో మాత్రమే చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి సహాయాలు సహకారాలు అందించడానికి ప్రయత్నాలు చేయడం లేదనే విధంగా తెలియజేశారు
కేవలం ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు ప్రచార ఆర్భాటం తప్ప ప్రజల సమస్యలను పట్టించుకునేలా కనిపించడం లేదని కేవలం తన చుట్టూ అధికారులను ఒక యంత్రంగా పెట్టుకుని క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా చూస్తున్నారంటూ ప్రశ్నించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. సహాయం అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది అనే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయమైతే అటు వైసిపి నేతలను కార్యకర్తలను కాస్త ఆనందపరిచేలా చేస్తోంది. ఇప్పటివరకు టిడిపి నేతలు కేవలం కొంతమంది మాత్రమే విరాళాలు ప్రకటించాలని మరి కొంతమంది ఆ పరిసర ప్రాంతాలలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు , ఎంపీలు సైతం ఎవరు కూడా ఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదట. మరి ఇకనైనా స్పందిస్తారని చూడాలి.