జగన్ అతి పెద్ద తప్పు అదే ! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు?
101. జగన్ అతి పెద్ద తప్పు అదే ! ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు?
వర్షాలతో తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. తెలంగాణలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. ఏపీలో కూడా ఇప్పుడిప్పుడే తెరపిస్తోంది. సహాయక చర్యల్లో ఏపీ ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో జరగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలను ఏపీ మంత్రి నారా లోకేశ్ మానిటరింగ్ చేస్తున్నారు.
ఎక్కడ,ఎవరికి సాయం చేయాలని సందేశం వస్తే చాలు అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వర్షాల గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. దాంతో పాటు ఏపీ రాజకీయాలపై కూడా స్పందించారు. ఎన్నికల అఫిడవిట్ లో చంద్రబాబు రూ.900 కోట్ల ఆస్తులను చూపించారు. ఆయన చట్టం ప్రకారం నడుచుకునే వ్యక్తి. మార్గదర్శిపై మాత్రం అభిమానం చూపారు. కేసు విషయంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు.
అయితే మార్గదర్శిపై మాత్రం చంద్రబాబు ప్రత్యేక అభిమానం చూపారని అన్నారు. ఈ నెల 11న మార్గదర్శి కేసు ఉందని.. ఆ వాయిదాల్లో ఏపీ సర్కారు అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. కక్ష సాధింపు చర్యల వల్ల అధికారుల తీరు మారనుంది. భవిష్యత్తులో సీఎంల మాటలను ఐపీఎస్ అధికారులు వినే అవకాశం లేదు అని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
గత ప్రభుత్వం తప్పిదాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అధికారులపై కేసులు పెట్టే అంశంపై జగన్ తప్పు చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆ తప్పును చంద్రబాబు చేయొద్దని కోరారు. చంద్రబాబుని జైలులో పెట్టి జగన్ అతి పెద్ద తప్పు చేశారని అరుణ్ కుమార్ గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడికి ఇది ఒక కారణమై ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆయనపై తప్పుడు కేసు బనాయించి 52 రోజుల పాటు జైల్లో పెట్టి ఉంచాల్సింది కాదన్నారు.