6 ఆరేళ్లుగా హిట్ లేక విలవిలలాడుతున్న వరుణ్ తేజ్... లావణ్య ఎఫెక్ట్ ఉందా ?
గత రెండు మూడు సంవత్సరాల నుంచి.. సరైన హిట్టు లేక.. ఈ మెగా హీరో అల్లాడిపోతున్నాడు. 2022 సంవత్సరంలో... విక్టరీ వెంకటేష్ అలాగే వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన ఎఫ్ 3 కొంతమేర హిట్ అయినప్పటికీ.. అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాలేదు. 2019 సంవత్సరంలో గద్దల కొండ గణేష్ సినిమాతోనే వరుణ్ తేజ్ మంచి హిట్ కొట్టాడని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కెరియర్ లో ఒక్క హిట్టు లేదు.
2022లో గని సినిమాతో వచ్చాడు. ఆ సినిమా రిలీజ్ అయిన విషయం ఎవరికీ తెలియకుండానే.. వెళ్లిపోయింది. ఇక 2023లో గాండీవ దారి అర్జున అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన వరుణ్ తేజ్ కు ఎదురుదెబ్బే తగిలింది. ఇక 2024 సంవత్సరంలో... ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ చేశాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాలు.. వరుణ్ తేజ్ కు నిరాశను మిగిల్చాయి. అందులో ఒకటి ఆపరేషన్ వాలంటైన్ అయితే... మొన్న రిలీజ్ అయిన మట్క కూడా ఉంది.
ముఖ్యంగా... హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్న తర్వాత... వరుణ్ తేజ్ కు కలిసి రావడం లేదని సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి జాతకంలో ఏదో దోషం ఉందని... అందుకే వరుణ్ తేజ్ కు పెద్దగా హిట్టులు... రావడం లేదంటూ కొంతమంది మెగా అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో మంచి కథను తీసుకొని... పదును పెడితే వరుణ్ తేజ్ కెరీర్ లో బంపర్ విక్టరీ పడడం ఖాయమని కొంతమంది అంటున్నారు.