ఉచితాలు: ఆ రాష్ట్రం గతే ఆంధ్రప్రదేశ్ కు పట్టబోతోందా.. పెద్ద హెచ్చరికేనా ..?

Divya
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం సాధ్యం కానటువంటి హామీలను సైతం టిడిపి నేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  తెలియజేశారు.. అయితే పథకాలు విషయంలో అమలు చేయమంటే ఆర్థికంగా ఏపీ దగ్గర నిధులు లేవంటూ తెలియజేస్తున్నారు. ఉచిత పథకాలు అంటూ చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు  వీటిని అమలు చేయలేకపోతున్నారు. కానీ ఉచిత పథకాలను చాలామంది మేనిఫెస్టో సమయంలోనే హెచ్చరించడం జరిగింది.. కానీ చాలామంది నేతలు వీటిని వినడం లేదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పడింది.

ముఖ్యంగా ఇలాంటి ఉచిత పథకాల వల్ల రాబోయే రోజుల్లో డబ్బు ఎంత  పెట్టిన దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అంటూ హెచ్చరించారు. కానీ రాజకీయ పార్టీలు వేలంపాట మాదిరిగా ఒకరు 2000 ఇస్తానంటే మరొకరు 4000 ఇస్తానంటూ జనం ముందు పెట్టి వారి యొక్క లబ్ధి పొందుతున్నారు. ప్రజలు కూడా ఉచితంగా వస్తుంది కదా అంటూ ఎక్కువ ఏ వైపు ఇస్తే ఆ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఉచితల వల్ల కలిగే ముప్పు ఏమిటో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కళ్ళకు కట్టినట్టుగా అన్ని రాష్ట్రాలకు చూపిస్తోంది.

హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం కాంగ్రెస్ చేతుల్లో ఉన్నది.. ముఖ్యంగా ఉచిత హామీలు ఎన్నో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పాత పెన్షన్ విధానాన్ని కూడా ఇస్తామని వీటితోపాటు ఉచితాలు ఇస్తామని చెప్పిన ఇప్పుడు ఆ రాష్ట్రం ఏమీ చేయలేక చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకుపోయినట్లు సమాచారం. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం జీతాలు తీసుకోమంటూ తెలియజేశారు. అయితే ఈ పరిస్థితి ఏర్పడడానికి ముఖ్య కారణం పెన్షన్ విధానమే అన్నట్లుగా తెలుస్తోంది.. అలాగే మహిళలకు 1500 రూపాయలు. బస్సులలో 50 శాతం ప్రయాణించే వారికి రాయితీ వీటికి తోడు ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. దీంతో హిమాచల్ ప్రదేశ్ 95 వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయట.

ఇక ప్రస్తుతం ఈ హెచ్చరిక ఏపీకి కూడా వర్తించేలా కనిపిస్తోంది. ఏపీ ఆదాయాలు చూస్తే లక్షన్నర కోట్ల రూపాయలు ఉందని చెబుతున్న ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే చాలా అయిపోతుందట. అప్పుల వడ్డీలు మాట విషయానికి వస్తే.. వీటి కంటే పెన్షన్లకే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చవుతోందట. రాజధాని నిర్మాణం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుంటున్నారు ఇది రాబోయే రోజుల్లో అప్పు కనుక  ఏపీకి నష్టం తీసుకువచ్చేలా చేస్తుంది. అలాగే సూపర్ సిక్స్ హామీలు కూడా ఇంకా కూటమి అమలు చేయలేదు.. వీటికి తోడు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఉద్యోగులు కోరుతున్నారు. ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే ఏపీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు తప్ప ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
దీన్ని బట్టి చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఉచిత పథకాలకు స్వస్తి పలకడమే మంచిదని చాలామంది తమ అభిప్రాయంగా ప్రజలు కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఉచితలను అమలు చేయాలంటూ  తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: