ఏపీ: అన్నదాత సుఖీభవ.. వచ్చేది ఆ పండుగకే..?
కానీ ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి తులసి రెడ్డి ప్రభుత్వాన్ని సైతం నిలదీయడం జరిగింది.. రైతులకు ఇవ్వాల్సిన 20వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం కచ్చితంగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించేవారనీ..ప్రస్తుత ప్రభుత్వం కూడా వెంటనే ఈ పథకాన్ని సైతం అమలు చేయాలి అంటూ అన్నదాతల తరఫున తాను కోరుతున్నాను అంటూ తెలియజేశారు. గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారి జాబితా ప్రభుత్వం వద్దనే ఉన్నది ఆ డేటాను ఉపయోగించి వెంటనే ఈ పథకాన్ని మొదలు పెట్టాలంటూ రైతులు కూడా తెలియజేస్తున్నారు.
వచ్చే దసరా పండుగకు లేకపోతే దీపావళి పండుగకు సైతం ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని మొదలుపెట్టేలా అధికారులు సన్నహాలు చేస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఇటీవలే సమీక్ష సమావేశం కూడా నిర్వహించినట్లు వ్యవసాయశాఖ మంత్రి సమాచారం. లబ్ధిదారులను గుర్తించే విధంగా మొబైల్ నెంబర్లు బ్యాంకు ఖాతాలకు లింక్ చేయాలని కూడా సూచిస్తున్నారట. అలాగే జియో ట్యాగ్ వంటివి కూడా చేయాలని సూచిస్తున్నట్లు సమాచారం పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.6000 ఏపీ ప్రభుత్వం రూ .14000 మొత్తం కలుపుకొని 20 వేల రూపాయలు అందించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. మరి ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి.