వైఎస్ లా తనకంటూ బ్రాండ్ సెట్ చేసుకుంటున్న రేవంత్ రెడ్డి

Chakravarthi Kalyan

తెలుగు జాతి చరిత్రను ఎన్టీఆర్ కు ముందు… ఎన్టీఆర్ తర్వాత అని చెబుతుంటారు. ఇప్పటి వరకు మదరాసీలుగా ముద్రపడిన తెలుగువారికి తెలుగు వారు అనే ప్రత్యేక గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు.


పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగు ఆత్మ గౌరవాన్ని దిల్లీ స్థాయిలో నిలిపారు ఆయన.  తెలుగువాడి సత్తాను దేశమంతా చాటారు అన్న ఎన్టీఆర్. ఇక తెలుగు రాజకీయాల్లోను టీడీపీతో చాలా మార్పు వచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్ చేతుల్లో నలిగిన రాష్ట్రానికి కొత్త దారి చూపించారు. ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఉర్దూ ప్రాబల్యంగా ఇతర జిల్లాల వారికి అనుకూలంగా లేని హైదరాబాద్ ని అందరి నగరంగా చేశారు. నడిబొడ్డున ఉండే అబిడ్స్ లో  నివాసం ఉటూ శివారులో ని గండిపేటలో ఆవ్రమం ఏర్పాటు చేసుకున్నారు. 


ఎన్టీఆర్ తర్వాత ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపారు. ఎన్ని విమర్శలు  ఉన్నా భారీ భవంతులతో సైబరాబాద్ ను నిర్మించారు. ఐటీ, బయో టెక్నాలజీ ని హైదరాబాద్ కి పరిచయం చేశారు. ఇక 2004లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ కు ఏర్పడిన బ్రాండ్ ఇమేజ్ ని మరికొంత పెంచారు. ఔటర్ రింగ్ రోడ్ అనే కొత్త ప్రాజెక్టును చేర్చారు. ఐటీ ఎగుమతులు పెరిగేలా చేశారు.


ఇక ప్రత్యేక తెలంగాణలో కడిగిన ముత్యంలా చూసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది. నాలుగో నగరం, రీజనల్ రింగ్ రోడ్డు అంటూ హైదరాబాద్ ఇమేజ్ ని మరింత పెంచేలా చేస్తున్నారు ఆయన. లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్ ఇప్పుడు లేక్ లెస్ సిటీగా అవుతున్న ప్రమాదాన్ని గుర్తించి హైడ్రాని తీసుకొచ్చారు. చెరవులను ఆక్రమించి విలాస భవనాలు కట్టుకున్న బడాబాబుల పని పడుతోంది.  ఇది విజయవంతంగా సాగితే ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్ తరహాలో రేవంత్ కి బ్రాండ్ ఇమేజ్ పెరిగినట్లే. డైనమిక్ సీఎంగా చరిత్ర పుటల్లో తన పేజీ ఉండాలని ఆయన భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: