బాల‌య్య సినీ స్వ‌ర్ణోత్స‌వం: బాలయ్య లైఫ్ స్టైల్.. బాలయ్యకు బాలయ్యే సాటి..!

FARMANULLA SHAIK
* పాత్రలో పరకాయ ప్రవేశం అంటే..బాలయ్య తర్వాతే.!
* లైఫ్ స్టైల్లో కూడా బాలయ్యకు సాటి బాలయ్యే..!
* దూకుడు స్వభావమే కాదు.. చేయిచ్చి ఆదుకోవడంలోనూ బాలయ్యే..!
(ఏపీ-ఇండియాహెరాల్డ్) :ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గూర్చి చెప్పాల్సిన పనిలేదు.ఆ తరం నుండి నేటి తరం వరకు వారి కుటుంబానికి అటు రాజకీయంగా అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అయితే ఎన్టీఆర్ తర్వాత వారి కుటుంబం నుండి మాస్ హీరోగా ఎదిగిన నటుడు నందమూరి బాలకృష్ణ.. ముద్దుగా ఆయన అభిమానులు బాలయ్య.. బాలయ్య అని పిలస్తుంటారు.రికార్డుల తడి ఆరకముందే ఆ రికార్డులను బాలయ్య తిరిగి రాస్తాడు,
అనేది అప్పట్లో నానుడి.జానపదం,పౌరాణికం,సాంఘికం, యాక్షన్, ఫ్యాక్షన్ ఏదైనా,పాత్ర ఏదైనా బాలకృష్ణ అదరగొట్టేస్తాడు. వయసుకు మించిన దూకుడుతో సౌత్ లోనే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ కొట్టిన అఖండుడు బాలయ్య. అయితే ప్రస్తుతం బాలకృష్ణ లైఫ్ స్టైల్ జర్నీఎలా కొనసాగిందో అనే విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ జూన్ 10 1960న మద్రాసులో జన్మించారు. అప్పట్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాస్ లో ఉండేది దాంతో బాలకృష్ణ యొక్క బాల్యమంతా మద్రాస్ లోనే గడిచింది.ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి మారడంతో తన తండ్రి అయినటువంటి నందమూరి ఎన్టీఆర్ తో పాటుగా ఆయన హైదరాబాద్ కు వచ్చేసి నైజాం కాలేజ్ నుంచి బ్యాచ్యురల్ డిగ్రీ ని పొందారు. అయితే తండ్రి ఎన్టీఆర్ కు ఎనిమిదవ సంతానంగా బాలకృష్ణ జన్మించారు. అయితే 22 ఏళ్ల క్రితం వసుంధర దేవిని పెళ్లి చేసుకున్న బాలయ్యకు ముగ్గురు సంతానంగా బ్రాహ్మణి తేజస్విని మోక్షజ్ఞ జన్మించారు. అయితే మోక్షజ్ఞ ను ఇండస్ట్రీకి పరిచయం చేసే పనిలో పడ్డారు నందమూరి బాలకృష్ణ.శతాధిక చిత్రాల కథానాయకుడు నందమూరి బాలకృష్ణ 1974లో తాతమ్మకల సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. బాలకృష్ణ ఆ చిత్రాన్ని స్వయంగా ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. 
అయితే బాలకృష్ణ 1984లో డైరెక్ట్ హీరోగా సాహసమే జీవితం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత ఎన్నో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని స్టార్డం హీరోగా ఎదిగాడు. అయితే అప్పట్లోనే కమర్షియల్ సినిమాలు చేస్తూనే ప్రయోగాల వెంట పరుగులు పెట్టాడు. బాలకృష్ణ చేసిన సినిమాల్లో చెప్పుకోదగ్గది సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆదిత్య 369 అప్పట్లో అది ఒక సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత భైరవద్వీపం సినిమాతో మరో కొత్త ప్రయోగం చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. బాలకృష్ణ కెరీర్ రూట్ మ్యాప్ ను మార్చేసిన సినిమాగా 1999లో  రాయలసీమ బ్యాగ్రౌండ్ తో వచ్చిన సమరసింహారెడ్డి నిలిచింది. అలాగే నరసింహనాయుడు సినిమాతో అతి పెద్ద హిట్ కొట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీని  ఫ్యాక్షన్ సినిమాల దారిపట్టేట్టు చేసాడు.అయితే బాలకృష్ణ కెరీర్లో నరసింహనాయుడు తర్వాత కొన్ని సినిమాలు భారీగా పరాజయమైనప్పటికీ ఏమాత్రం తన క్రేజ్ తగ్గకుండా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటా వచ్చారు. అయితే 2010లో ఆ లోటుని బోయపాటి సింహ సినిమా ద్వారా తీర్చారు. ఆ తర్వాత బోయపాటి డైరెక్షన్లో వచ్చిన లెజెండ్ అఖండ బాలకృష్ణని ఏ రేంజ్ లో ఎలివేట్ చేశారో చెప్పాల్సిన పనిలేదు.బాలకృష్ణ అవార్డ్స్ విషయానికొస్తే మూడు నంది అవార్డులు, మూడు సంతోషం అవార్డులు, ఒక సినిమా అవార్డు,ఒక సైమా అవార్డు ,ఒక టీఎస్సార్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక పొలిటికల్ కెరియర్ విషయానికి వస్తే 2014లో టిడిపి తరఫున రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. 

దాదాపు బాలకృష్ణ ఒక సినిమాకు ఏడు కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు బాలయ్య టోటల్ నెట్వర్త్అనేది 800 కోట్లు. ఎన్.బి.కె ప్రొడక్షన్స్ అనే సొంత ప్రొడక్షన్ బ్యానర్ కూడా బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తుంది..64 ఏళ్ల వయసులో కూడా  బాలయ్య ఈవెంట్ లకు బయటకు వచ్చినప్పుడు జీన్స్ ప్యాంటు తో ఇన్ షర్ట్  చేసుకునే వస్తారు.బాలకృష్ణకు 15 కోట్ల విలువతో కూడిన ఇల్లు జూబ్లీహిల్స్ లో ఉంది. ఇకపోతే బాలయ్య దగ్గరున్న కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఒక కార్ మూడు కోట్ల 92 లక్షలతో కూడిన ఒక కారు నారా బ్రాహ్మణి బాలకృష్ణ కు గిఫ్టుగా ఇచ్చింది ‌. అలాగే ఒక కోటి 50 లక్షలతో ఇంకొక కారు, ఒక కోటి 35 లక్షలతో మరో కారు, అలాగే వాటితో పాటు ఇంకొక అయిదారు కారులు బాలకృష్ణ గారేజ్ లో ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ కు ఉన్న మరొక కోణం చెయ్యి దూకుడే కాదు  చెయ్యిచ్చి ఆదుకోవడం కూడా తెలుసు. కరోనా రిలీఫ్ టైం లో కోటి 25 లక్షలు విరాళం అందించారు. అలాగే ప్రకృతి విపత్తుల సంబంధించినప్పుడు భారీగా విరాళాలు కూడా ఇస్తుంటారు. ప్రాణాపాయంలో ఉన్నత అభిమానులతో డైరెక్ట్ గా మాట్లాడి వాళ్లకు మానసికంగా  ధైర్యాన్ని ఇస్తుంటారు.అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేదవాళ్లకు ఉచితంగా లేదా అతి తక్కువ ధరలకే వైద్య సహాయం అందిస్తుంటారు ‌. బాలయ్య ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ రామాయణ మహా భారతంలోని పద్యాల ను అల ఓకగా పాడేస్తుంటారు‌.డిసిప్లిన్ పరంగా బాలకృష్ణ పాటించే పద్ధతులు నియమాలు బాలకృష్ణుడుని ఈ స్థాయికి చేర్చగలిగాయి. మాక్సిమం ఎలాంటి రిస్క్ సీన్లు అయినా సరే డూప్ లేకుండా చేయడంలో బాలకృష్ణ ముందుంటారు ‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: