బాలయ్య సినీ స్వర్ణోత్సవం: పేదల ప్రాణదాతగా బాలయ్య..ఎన్టీఆర్ వైద్యరథ చక్రంతో ఇంటికే వైద్యం.!!
- క్యాన్సర్ ఆస్పత్రితో లక్షలాదిమంది ప్రాణాలు కాపాడిన వీరుడు..
- ఎన్టీఆర్ వైద్యరథ చక్రంతో ప్రాణదాతగా నిలుస్తున్న బాలయ్య..
బాలకృష్ణ.. ఈయన పేరు చెప్పగానే చాలామంది సినిమాల గురించి చెబుతారు. కానీ ఈయన సినిమాల కంటే ఎక్కువగా తనను నమ్మిన పేద ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు. వారికోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి బాల్య గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తెలుగుదేశం పార్టీ కోసం తన హిందూపురం నియోజకవర్గం లో ప్రజల కష్టాలు తీరుస్తూ అద్భుతంగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచే రికార్డు సృష్టించారు. అలాంటి బాలయ్య టిడిపి అధికారంలో ఉన్న లేకపోయినా తన సొంత ఖర్చులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం ఆయన నియోజకవర్గ ప్రజల కోసం ఎన్టీఆర్ వైద్యరథం పేరుతో రథచక్రాన్ని ప్రారంభించారు. దాని ద్వారా రోజుకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ పేదల ఇంటికే వైద్యాన్ని తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు..
వైద్య దాత బాలయ్య:
నందమూరి ఫ్యామిలీలో ఎవరు కూడా ఎంబిబిఎస్ చదవకపోయినా కానీ వైద్యరంగంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ భార్య బాలకృష్ణ తల్లి బసవతారకం క్యాన్సర్ వ్యాధితో ట్రీట్మెంట్ అందక చనిపోవడంతో ఎంతో చలించి పోయిన నందమూరి ఫ్యామిలీ బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి ద్వారా రోజుకు వేలాదిమంది పేద ప్రజలకు క్యాన్సర్ వైద్యం అందిస్తూ లక్షలాది మంది ప్రాణాలు కాపాడారు. నందమూరి బాలకృష్ణ కూడా నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడకూడదని నా తండ్రి ఎన్టీఆర్ పేరుతో ఆరోగ్య రథ చక్రాన్ని ప్రారంభించి రోజు లక్షలాది రూపాయల మందులను పేద ప్రజలకు పంచుతున్నారు. ఈ రథచక్రంలో ఒక పెద్ద డాక్టర్,నర్స్ తోపాటు ఇద్దరు ఏఎన్ఎంలు,డ్రైవర్లు, ఫార్మసిస్టులు,హెల్పర్లు అందరూ ఉంటారు. అంతే కాదు వైద్యం కోసం వచ్చిన వారికి బీపీ,షుగర్ పరీక్షలు చేసి అక్కడే ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. నిర్ధారణ పరీక్షలు చేసుకున్న తర్వాత ఉచితంగా మందులు అందిస్తున్నారు.