రోజా: పార్టి మారడం పై.. ఎన్నికలలో ఓటమిపై సంచల వ్యాఖ్యలు..!

Divya
వైసిపి మహిళ మంత్రి రోజా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించింది.. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా పార్టీ మారుతోందని తమిళ రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది అనే విధంగా వార్తలయితే వినిపించాయి.. కానీ ఈ విషయం పైన ఆమె స్పందించలేదు. తాజాగా నిన్నటి రోజున అన్ని విషయాలకు పుల్ స్టాప్ పెడుతూ ఒక క్లారిటీ ఇచ్చింది నగరి మాజీ ఎమ్మెల్యే రోజా.

రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఒక సునామిలాగా జరిగిపోయయాని తెలియజేశారు మాజీ మంత్రి రోజా. ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదని నాయకులు ఎవరు కూడా ఎలాంటి తప్పు చేయలేదని కానీ వైసీపీ పార్టీని ఇంత ఘోరంగా ఓడించాల్సి వచ్చిందని తెలియజేసింది. నగరి లో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా పాల్గొన్నప్పుడు ఈ విషయాలను తెలియజేసింది.. ఏ రోజుకైనా ఎవరు ఓడించారనే విషయం బయటకి వస్తుందని అధికారంలో ఉన్నప్పుడే కాదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలకు తాము అండగా ఉంటామని తెలియజేసింది రోజా. ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో ప్రొఫైలను కూడా మార్చేయడంతో అందరూ పలు రకాలుగా కామెంట్స్ చేశారు.

అయితే వైసిపి అధినేత జగన్, భారతిల పెళ్లి రోజు సందర్భంగా విష్ చేయడంతో రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టింది.. ఆ తర్వాత తానే వైసీపీ పార్టీ వెంట ఉంటానని సంకేతాన్ని కూడా ఇచ్చింది రోజా.. వైసిపి ప్రభుత్వంలో ఈమె హంగామా భారీగానే ఉండేది నాయకుల పైన ఎలాంటి విమర్శలు చేసిన తీవ్రమైన విమర్శలు చేస్తూ ఘాటైన విమర్శలు చేస్తూ ఉండేది రోజా. నగర్ నుంచి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది ఆమె మీద టిడిపి అభ్యర్థి గాలు భాను ప్రకాష్ గెలిచారు. ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమె వైసిపి కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: