సీక్రెట్ అవుట్.. ట్రంప్ పై భారీ కుట్ర, ఇలా అయితే గెలవడం కష్టమే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సారి జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు సినిమాటిక్ మలుపులు తలపిస్తున్నాయి. చప్పగా సాగుతున్న ఎన్నికలకు బైడెన్ నిష్క్రమణతో ఒక్కసారిగా ఊపు వచ్చింది. ట్రంప్ వర్సెస్ బైడెన్ వేళ.. ట్రంప్ ఆధిక్యతను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు బైడెన్ పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
దీంతో అధ్యక్ష బరిలోకి అనూహ్యంగా కమలా హారిస్ దూసుకువచ్చారు. ఆమెను అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ బైడెన్ సెలవు తీసుకున్నారు. అప్పటి వరకు అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల హవా నడుస్తున్న దానికి భిన్నంగా డెమోక్రాట్ల అధిపత్యం షురూ అయింది. చూస్తుండగానే కమలా హారిస్ ఆధిక్యతను కనబరుస్తూ వచ్చారు. ట్రంప్ కంటే స్వల్ప ముందంజ లో ఉన్నారు. భారత మూలాలు ఉన్న ఒకప్పటి డెమెక్రటిక్ తులసి గబార్డ్ ట్రంప్ నకు మద్దతు తెలపడం కమలకు ఇబ్బందికర పరిస్థితిని తెచ్చి పెట్టింది.
ఇప్పుడు మరో తాజా నాటకీయ రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి చెందని 200 మంది నేతలు కమలా హారిస్ కు మద్దతు ప్రకటించారు. అదే సమయంలో ట్రంప్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తో పోలిస్తే కమలా హారిస్ నాయకత్వంలోనే అమెరికా భద్రత కలిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కమలా హారిస్ కు మద్దతు తెలిపిన వారిలో జార్జిబుష్ హయాంలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించిన వారే కావడం విశేషం.
తాజాగా వీరంతా డొనాల్డ్ కు వ్యతిరేకంగా.. కమలా హారిస్ కు మద్దతు పలుకుతూ తీర్మానం చేశారు. ట్రంప్ ను రెండో సారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటే దేశానిని విపత్తు ఖాయమని పేర్కొన్నారు. తాజాగా విడుదల చేసిన బహిరంగ లేఖలో ఈ విషయాన్ని వారు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకితస్తూ పలువురు రిపబ్లికన్ నేతలు తమ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాకపోతే ఈసారి తాజా పరిణామం ట్రంప్ కు ఇబ్బంది కర పరిస్థితే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.