ఏపీ: పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!

Divya
ఆంధ్రప్రదేశ్లో పింఛనీదారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచి గుడ్ న్యూస్ ని చెప్పింది. ముఖ్యంగా ఇంటి వద్దకే పింఛన్లను సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించేలా కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ నెలలో సెప్టెంబర్ ఒకటవ తారీఖున ఆదివారం కావడం చేత అన్ని పింఛన్లను ఈనెల 31 వ తేదీనే ఇచ్చేలా కొండపల్లి శ్రీనివాస్ మంత్రి తెలియజేశారు. వాటి గురించి చూద్దాం.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒకటవ తేదీన ఆదివారం కావడం చేత సచివాలయం ఉద్యోగులకు హాలిడే కనుక పింఛన్దారులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కూటమి ప్రభుత్వం భావించి.. పింఛన్ పంపిణీ ని వాయిదా వేయకుండా ఒక రోజు ముందుగా అంటే ఈ నెల 31వ తేదీనే పెన్షన్ ఇచ్చేలా ఏపీ సీఎం సూచించారంటూ తెలిపారు. అయితే ఆరోజున పింఛన్ తీసుకొని వారు ఉంటే రెండవ తేదీ తీసుకోవలసి ఉంటుందట. రాబోయే రోజుల్లో ఒకటవ తేదీ ఆదివారం వస్తే కచ్చితంగా 31వ తేదీని పింఛన్ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందంటూ తెలిపారు.

టిడిపి పార్టీ కార్యాలయంలో జరిగేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమాలలో కూడా రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి చాలా సమస్యలు గ్రీవెన్స్ లో తమ దృష్టికి వచ్చాయంటూ మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు.. ఇందులో భాగంగానే కొన్ని రెవెన్యూ సమస్యల పైన కూడా అలా గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలను సైతం వెంటనే పరీక్షించడానికి పనిచేస్తున్నామంటూ తెలియజేశారు. ఇంక కూడా అనేక సమస్యల పైన కూడా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయని.. అందుకు సంబంధిత శాఖల అధికారులతో కూడా మాట్లాడి వాటిని పరిశీలించి సాల్వ్ చేస్తున్నామని కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. దీంతో ఏపీ ప్రజలకు పించిని తీసుకుని వారికి ఒక్కరోజు ముందే.. పింఛన్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీంతో పింఛనిదారులు  కూడా ఆనందాన్ని తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: