ఎన్నో విమర్శలు చుట్టుముట్టిన... పట్టు వదలని విక్రమార్కుడే 'పవన్ కళ్యాణ్'..!
* ప్యాకేజీ స్టార్,దత్తపుత్రుడు అంటూ వైసీపీ తీవ్ర విమర్శలు.!
* పట్టువదలని విక్రమార్కుడి వలే పవన్ ప్రస్థానం.!
(ఏపీ-ఇండియాహెరాల్డ్): పవన్ కళ్యాణ్.. ఆ పేరు వినగానే రాష్ట్రంలోని యువత చేసే హడావిడికి అడ్డుకట్ట వెయ్యలేని పరిస్థితి. మొదటి నుండి ఆయనకున్న దూకుడు స్వభావం ఈరోజు ఆయన్ను రాష్ట్ర మరియు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేలా చేసాయి.సినిమాల్లో ఉన్నప్పుడే ఆయన పవర్ స్టార్గా అభిమానులను సొంతం చేసుకొని, రాజకీయాల్లో వచ్చిన తర్వాత జనసేనానిగా మారిన అభిమానుల్లో పవన్ పట్ల క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు.పవన్కళ్యాణ్ గారి రాజకీయాప్రస్థానం అనేది మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తోనే ప్రారంభం అయిందని చెప్పాలి. చిరంజీవి 2008 ఆగస్ట్ 26 న తిరుపతి వేదికగా తన ప్రజారాజ్యం పార్టీను ప్రారంభించారు. ఆ పార్టీలో రాష్ట్ర యువ విభాగమైన యువ రాజ్యం కు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు పవన్.అయితే అప్పటి 2009 ఎన్నికలలో టిడిపి,కాంగ్రెస్,పిఆర్పికి మధ్య త్రిముఖ పోరులో మెగాస్టార్ స్థాపించిన పిఆర్పికి ఎదురు దెబ్బ తగిలింది. దాంతో రాష్ట్రంలో మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో చిరంజీవి పిఆర్పిని కాంగ్రెస్లో విలీనం చేశారు.దాంతో అన్నయ్య ఓటమిని జీర్ణించుకోలేకపోయిన పవన్ పొలిటికల్గా ఎంట్రీ ఇద్దామనుకొని 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు.2014 రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా టిడిపికి మద్దతుగా ఉండి టిడిపి గెలుపులో క్రియాశీలకంగా వ్యవహరించారు.
2014లో టిడిపి అధికారంకి వచ్చినా తర్వాత ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ ను ఎన్నో విమర్శలు గురి చేసినా వాటికి టిడిపిపై ఎప్పుడు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది లేదు. అయితే ఉద్దానం కిడ్నీ బాధితుల తరఫున పోరాటం మరియు రాజధాని రైతుల భూముల కోసం,ప్రత్యేక హోదాపై మాట మార్చిన చంద్రబాబు వైఖరిని ఖండిస్తూ మొదటిసారి 2018 మార్చిలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిడిపికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ లక్ష్యం అధికారం కాదని ప్రజలకు సేవ చేయడం అనేధోరణితో రాజకీయాల్లోకి వచ్చిన సంగతి ఆయన మెదటి నుండి చెప్తుందే. ప్రజా సమస్యలపై గళం వినిపించడం ప్రారంభించిన పవన్ చిన్న చిన్నగా టిడిపిని విమర్శించడం మొదలుపెట్టాడు.ఆ టైంలో ఒకవైపు అధికారంలో ఉన్న టిడిపికి అలాగే నరేంద్ర మోడీకి ఇద్దరినీ విమర్శిస్తూ ఇద్దరిని దూరంచేసుకున్నారు. ఒంటరిగానే ప్రజలపై పోరాడడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే బరిలో దిగి కేవలం ఒక్కసీట్తో సరిపెట్టుకుంది.అయితే ఆ ఎన్నికలు పవన్ కళ్యాణ్ కు తీవ్ర ప్రభావాన్ని గురి చేశాయి. అయితే నా తుది శ్వాస విడిచే వరకు నేను పార్టీని నడుపుతారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ గా బాగా సంచలనంగా మారాయి.2019లో వైసీపీ విజయంతో రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని రాక్షస పాల నడుస్తుందని విమర్శించిన పవన్ కళ్యాణ్కు వైసీపీ అధినేత జగన్ తో సహ ఇతర వైసీపీ నేతలు వ్యక్తిగతంగా బాగా ఇబ్బందికి గురిచేసారు.అయితే ఎన్నికలకు ముందు ఇటీవల జరిగిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది సంచలనంగా మారి పవన్ బాబు అరెస్ట్ అనేది కలవర పెట్టింది. దాంతో ఎలాగైనా సరే వైసీపీ అంతూ చూడాలనే ఉద్దేశంతో మరల బాబుతో, మోడితో పొత్తు పెట్టుకొని జగన్ను విమర్శించేవారు. దాంతో జగన్, అలాగే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో దత్త పుత్రుడు, ప్యాకేజీ స్టార్, వ్యక్తిగతంగా మూడు పెళ్లిళ్ల విషయం లేవనేత్తుతూ పవన్ ను నానారకాలుగా ఇబ్బందికి గురిచేసారు.అయితే పవన్ కూటమితో ఎన్నికల బరిలోకి దిగి భారీ విజయాన్ని అందుకున్నారు. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ఒక సంచలనంగా మారారు. ఒకవైపు నిలకడ లేని వ్యక్తిగా సొంతపార్టీ పెట్టి కూడా ఇతర పార్టీలను కలుపుకుని ఎన్నికలలో దిగడం అనేది పవన్ కళ్యాణ్ స్థాయికి తీరని లోటుని రాష్ట్ర ప్రజల్లో వైరల్అవుతున్న సమాచారం.