సినీ నటి , రాజకీయ నాయకురాలు విజయశాంతి గురించి ప్రత్యేకంగా తెలుగు జనాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఈమె అనేక విజయాలను అందుకోవడం , దానితో ఈమెకు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కడం జరిగింది. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి వెళ్ళింది. కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత ఒసేయ్ రాములమ్మ , రక్షణ మరియు అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి హీరోల స్థాయి ఈమేజ్ ను సొంతం చేసుకుంది.
దానితో ఈమె కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాల్లో అందాలతో ఆకట్టుకున్న ఆ తర్వాత కేవలం నటన ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లోని నటిస్తూ వచ్చింది. అలా కెరియర్ అద్భుతమైన జోష్ లో ముందుకు సాగుతున్న సమయంలోనే విజయశాంతి రాజకీయాలపై ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా విజయశాంతి 1998 లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె మొదట (బీజేపీ) భారతీయ జనతా పార్టీలో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005 లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించింది.
ఆ తర్వాత కొంతకాలానికి విజయశాంతి ఆ పార్టీని 2009 లో (టీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. విజయశాంతి 2009 లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది. విజయశాంతి ని 2013 లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. విజయశాంతి 2014 లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. విజయశాంతి 2014 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది. కానీ ఆ ఎన్నికలలో విజయశాంతి ఓడిపోయింది.
ఆమె 2020 డిసెంబరు 07 న భారతీయ జనతా పార్టీలో చేరి 2023 నవంబరు 15 న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసింది. ఆ తర్వాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇది ఇలా ఉంటే విజయశాంతి ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిందో అప్పటి నుండే ఆపోజిట్ పార్టీలపై తనదైన రీతిలో స్పందించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే విజయశాంతి అనేక పార్టీలపై తనదైన రీతిలో స్పందించిన సందర్భాలు ఉన్నాయి. అలా స్పందించిన సమయాలలో ఆమె వైరల్ కావడం , కొన్ని విషయాలలో కాంట్రవర్సీలు కూడా జరగడం జరిగిన సందర్భాలు ఉన్నాయి.