ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం.. గణేష్ ఉత్సవ కమిటీ షాకింగ్ నిర్ణయం?

praveen
ఈ మధ్య కాలంలో సభ్య సమాజంలో అత్యాచార ఘటనలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మహిళలను చూస్తే చాలు మగాళ్లు మృగాలుగా మారిపోయి రాక్షసుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా మీద పడి మృగాల్లా అత్యాచారాలు చేయడమే కాదు.. దారుణంగా హత్యలు కూడా చేస్తూ ఎంతో మంది ఉసురు తీస్తున్నారు. అయితే ఇక ఇలా అత్యాచార ఘటనల్లో  నిందితులను కోర్టులో ఎంత కఠినంగా శిక్షించినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.

 అయితే మొన్నటికి మొన్న కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై దారుణంగా అత్యాచారం జరిగి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది ప్రాణాలు కాపాడాలి అనే ఉద్దేశంతో  వైద్య వృత్తిలోకి వచ్చిన యువతిని చివరికి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశం మొత్తాన్ని ఉనికిపడేలా చేసింది. ఇక ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తాయి అనే విషయం తెలిసిందే.

 అయితే కోల్కత్తా ట్రైని ఈ డాక్టర్ పై అత్యాచారం నేపథ్యంలో ఈసారి గణేష్ ఉత్సవాలను సాధారణంగా నిర్వహించాలని కోల్కతాలోని గణేష్ ఉత్సవ కమిటీలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే.. ఈసారి మండపాన్ని అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం అనే థిమ్ తో ఏర్పాటు చేస్తామని ఓ కమిటీ వెల్లడించింది. చందర్ నగర్ లోని శాటిలైట్ టౌన్షిప్ సాల్ట్ లేక్లో నిర్వహించే లైట్ షో ని కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కాగా ప్రతి ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలకి భారీ మొత్తంలోనే ప్రజలు హాజరవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు గురించి రోజుకు ఒక షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి  అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: