ఏపీ: సచివాలయాల ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం..?

FARMANULLA SHAIK
ఏపీలో సీఎం చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వనిర్ణయాలపై ప్రక్షాళన మొదలు పెట్టింది. అందులో భాగంగా గత ప్రభుత్వం వార్డు -గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతిష్ఠాత్మకంగా భావించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ సచివాయల ప్రక్షాళన దిశగా అడుగులువేస్తోంది. కొన్ని విభాగాలకు చెందిన కార్యదర్శులను ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గ్రామ వార్డు సచివాలయాల శాఖను ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది.సచివాలయాల్లో సిబ్బంది సేవలు సర్దుబాటు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని యోచిస్తోంది. మిగతావారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను ఇరిగేషన్‌ శాఖలో ఏఈలుగా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్‌ శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌కి ఆదేశాలిచ్చినట్లు సమచారం.
రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,34,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 1,26,000 మంది ఉన్నారు. సగటున 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివాలయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉన్నారు. వీరిలో నలుగురైదుగురిని మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసుకోవడం ద్వారా ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇరిగేషన్‌తో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో ఏఈల కొరత ఉంది.

ఆయా మండలాల్లో ఈ ఉద్యోగాలను ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని యోచిస్తోంది.గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి. వీటి మధ్య సంబంధాల్లో స్పష్టత లేదు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులు పలు శాఖల ఆదేశాలతో పనిచేస్తున్నారు. ఇదే పరిస్థితి వార్డు సచివాలయాల్లోనూ నెలకొంది. వాటిలోని కార్యదర్శులు ఎక్కువగా మున్సిపల్‌ శాఖతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్‌ -రెగ్యులేషన్‌, శానిటేషన్‌ కార్యదర్శులను తగ్గించాలనే సిఫార్సులు ప్రభుత్వానికి అందాయి. దీంతో, ఇప్పుడు ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ప్రక్షాళన దిశగా తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.ప్రభుత్వం నిర్ణయంతో గ్రామ,వార్డ్ సచివాలయాల్లో సిబ్బందికీ ఉద్యోగరీత్యా భయం అనేది ప్రారంభం అయింది అని తెలుస్తుంది. వారందరిని ఇప్పటికే పెన్షన్ పంపిణిలలో అలాగే ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం పాఠశాలలో బాత్రూమ్స్ ఫొటోస్ తీసి గవర్నమెంట్ సైట్ లో అప్లోడ్ చేసే బాధ్యతలు అప్పగించారు. ఇంకా వారందరిని ఏ విధంగా వాడుకుంటారో అనే భయాందోళన సచివాలయ సిబ్బందిలో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: