ఏపీ: రేవంత్ రెడ్డి చేస్తే హీరో.. జగన్ చేస్తే విలన్..!

Divya
రేవంత్ రెడ్డి సినీ హీరో నాగార్జున N కన్వెన్షన్ ను కూల్చడం అనేటువంటి ఉదాంతం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక పాఠం.. మా పార్టీ నేను ఎంత చెబితే అలా నడుస్తుంది.. మీడియా అంతా కూడా ఎవరేం రాసుకున్న నేను గెలిచానా లేదా అని భావించారు జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ అయినప్పటికీ.. నెగిటివ్ వాటికి పాజిటివ్ అన్నవాటికి తేడా ఇదే.. మీడియా నెగిటివ్ సృష్టిస్తుంది కానీ పాజిటివ్ సృష్టించలేదు. జగన్ ని విలన్ చేసింది కానీ చంద్రబాబుని హీరో చేయలేకపోయింది మీడియా.

జగన్ విలన్ కాబట్టి చంద్రబాబు నాయుడు గెలిచారు. ఇక్కడ పాయింట్ ఇదే హైలెట్. మీడియా ఎప్పటికైనా పాజిటివ్ క్రియేట్ చేయలేదు.. కానీ నెగటివ్ ని క్రియేట్ చేస్తుంది. ఒక తప్పుని కవర్ చేయగలదు.. కానీ ఒప్పుని తప్పుగా చూపించగలదు. ప్రస్తుతం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు సోషల్ మీడియా చేస్తున్న పని కూడా ఇదే..N కన్వెన్షన్ ను కూల్చడాన్ని కచ్చితంగా సమర్థిస్తారు ఎందుకంటే.. చెరువులోపల కబ్జా చేసిన తర్వాత వాటిని కాదనేటువంటిది ఏంటి.. అలాంటిది ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర పగలగొడతారా. దుర్గం చెరువు ఎక్కడుంది వాటి చుట్టూ ఏమున్నాయి.. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలే.. వీటిని కూల్చగలుగుతారా అనే ప్రశ్న మొదలయ్యింది.

ఇలా చేయడం ఒక హీరో ఇజమే.. అదే ఇక్కడ ఆంధ్రాలో కబ్జాలకు సంబంధించి చర్యలు తీసుకుంటే.. కృష్ణానది పరివాహక ప్రాంతం లోపల.. చంద్రబాబు నాయుడు ఇల్లు వరద కట్ట లోపల ఉన్నది. అంటే నది లోపలే ఉన్నది. మరొక నేత ఆది లింగమనేనిదే కావచ్చు  ఇంకొకరిది కూడా కావచ్చు.. అది పట్టుకోగానే రాజకీయ కక్ష సాధింపులు అన్నట్లుగా దారుణం దుర్మార్గం అన్నట్లుగా మీడియా సృష్టిస్తూ ఉంటుంది. ఇదే రోజున ఈ రోజున N కన్వెన్షన్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి వారు ఆరోజున అది చేస్తే కక్ష సాధింపు అయింది. అదే సందర్భంలో అయ్యన్నపాత్రుడి ఇంటి మొత్తాన్ని కూల్చలేదు.. రెండు అడుగులకు సంబంధించిన వాటిని కూల్చారు. వాటిని కక్ష సాధింపు చర్యలు కూడా అన్నారు. ఎందుకంటే అది ప్రత్యర్థుల పార్టీది కాబట్టి.

ఇది కూడా ప్రత్యర్థి అయినా నాగార్జునదే కాబట్టి నాగార్జునను ఏనాడో రేవంత్ రెడ్డి చెప్పారు.. అక్కడ హీరో ఇజం అయింది ఇక్కడ విలనిజం అయింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. న్యూట్రల్ అనేటువంటి ముసుగులో నడిచేస్తున్నటువంటి పత్రికలను తను ప్రోత్సహించి పెట్టుకోవడం లేకపోతే ప్రోత్సహించడమా.. మరి ఒక నాలుగైదు చానల్ తో టైప్ అవ్వడమా.. కొత్తగా రెండు మూడు చానల్ ని ప్రోత్సహించడం వంటివి చేయాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తోడు నిలుస్తారని టిడిపి పార్టీ చేసి చూపించింది.. మీడియా లేకపోతే నువ్వు ఎంత చేసినా కూడా నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టినా కూడా చివరికి విలన్ వే అవుతావు అనేది సజీవ సాక్ష్యంగా మిగిలింది. ఏమి ఇవ్వకపోయినా హీరోలవుతారు అనేది ప్రత్యర్థుల సాక్షి మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: