చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు అయితే రాజకీయ నాయకులు ఎక్కువ శాతం న్యూస్ పేపర్ ద్వారా తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేసేవారు. కానీ ఎవరికి అయితే న్యూస్ పేపర్ సంస్థలు ఉంటాయో వారికి సంబంధించిన వార్తలే ఎక్కువగా ప్రజల్లోకి వెళుతూ ఉండేవి.
చిన్న చిన్న నేతలు తమ భావాలను వ్యక్తపరిచేందుకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. ఆ తర్వాత టెక్నాలజీ కాస్త పెరిగి న్యూస్ చానల్స్ వచ్చాయి. దానితో కొంత చిన్న సమస్యలు జనాల్లోకి వెళ్లే అవకాశం ఏర్పడింది. కానీ అక్కడ కూడా ఎవరికైనా ఒక మీడియా సంస్థ ఉన్నట్లు అయితే వారికి సంబంధించిన వార్తలే ఎక్కువగా జనాల్లోకి వెళ్లే ఆస్కారం ఉండేది.
దాని ద్వారా కూడా కొంత మంది నేతలు అనుకున్నవి అనుకున్నట్లుగా చెప్పే స్వేచ్ఛ ఉండేది కాదు. ఇకపోతే ప్రస్తుతం పరిస్థితులు మొత్తం మారాయి. ఎవరైనా ఏదైనా విషయాన్ని జనాలకు చెప్పాలి అనుకుంటే తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా దానిని జనాల ముందు సెకండ్లలో ఉంచవచ్చు.
అలా వారు ప్రభావవంతమైన విశాయలను తెలియజేసినట్లు అయితే జనాలు కూడా వారిపై దృష్టి చూపిస్తారు. దానితో ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎంతోమంది ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఇకపోతే సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్న పొలిటికల్ లీడర్లలో రఘునందన్ రావు ఒకరు. రఘునందన్ రావు తన రాజకీయ జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా ప్రారంభించాడు. చాలా కాలం పాటు ఈ పార్టీలో కొనసాగిన ఈయన 2013 వ సంవత్సరం తెలుగు దేశ పార్టీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనే ఆరోపణలతో ఈయనను టిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.
ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక చాలా తక్కువ కాలంలోనే ఆ పార్టీ నుండి బయటకు వచ్చి బిజెపి పార్టీలో జాయిన్ అయ్యారు. 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఆ తర్వాత 2020 లో జరిగిన దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాదించారు. ఇక తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో రఘునందన్ రావు మెదక్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా గెలుపొందాడు.
ఇక రఘునందన్ గెలుపు , ఓటములు పక్కన పెడితే ఆయనకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా కూడా అద్భుతమైన క్రేజ్ వచ్చింది. మరి ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికల సమయానికి రఘునందన్ కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. దానితో ఈయనకు ఆ ఎన్నికలలో సోషల్ మీడియా చాలా ఉపయోగపడింది.
అలాగే కొంత కాలం క్రితం జరిగిన మెదక్ ఎంపీ ఎలక్షన్లలో కూడా ఈయనకు సోషల్ మీడియా ద్వారా మంచి మైలేజ్ వచ్చింది. రఘునందన్ కు ఫేస్బుక్ ఫ్లాట్ ఫామ్ లో 507కే ఫాలోవర్స్ ఉండగా , X లో 172 కే ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఇందులో ఈయన పోస్టులు చేస్తూ ఉండడంతో రోజు రోజుకీ ఈయన ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది.
అలాగే సోషల్ మీడియాలో ఈయన క్రేజ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇలా సోషల్ మీడియాను ఉపయోగించుకొని రఘునందన్ అద్భుతమైన స్థాయిలో ఇంపాక్ట్ ను చూపిస్తున్నాడు.