వీడియో: 25 కిలోల బంగారం ధరించి తిరుపతి శ్రీవారి ఆలయంలో చక్కర్లు..!

praveen

మన దేశంలోని ప్రజలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు కొంతమంది బంగారాన్ని చాలా ఎక్కువగా ధరించడం మొదలుపెట్టారు. ఇటీవల పూణెకు చెందిన ఓ కుటుంబం శరీరం అంతా బంగారంతో నింపుకుని తిరుమల తిరుపతి ఆలయంలో తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ కుటుంబంలోని వాళ్ళు అందరూ కలిపి 25 కిలోల బరువైన బంగారు ఆభరణాలు ధరించి మెడలో వేసుకున్నారు. వీరు తిరుమల వెంకన్న స్వామిని సందర్శించుకోవడానికి వచ్చారు. విఐపి బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు.
పూణె నుంచి వచ్చిన ఈ కుటుంబం నిన్న (ఆగస్టు 22) తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళారు. వాళ్ళు అందరూ కలిపి 25 కిలోల బంగారం నగలు వేసుకున్నారు. ఈ విషయం గురించి ఒక వీడియోను పీటీ అనే వార్తా సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ పెట్టింది. ఆ వీడియోలో ఇద్దరు మగవారు, ఒక మహిళ , ఒక పిల్లవాడు మెరిసే బంగారం నగలు వేసుకుని కనిపించారు. మగ వ్యక్తులు తమ మెడ నిండా బంగారపు గొలుసులు వేసుకుని కనిపించారు. అంతేకాకుండా వాళ్లు బ్రాండ్ సన్ గ్లాసెస్ కూడా వేసుకుని తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు నిలబడి ఉన్నారు.
అయితే, ఆ కుటుంబంలో ఎవరు ఉన్నారో ఇంకా తెలియదు. తిరుమల దేవస్థానంలో భక్తులు ఏడాది పొడవునా బంగారం సమర్పిస్తారు. అక్కడికి వెళ్ళే చాలామంది భక్తులు తమ దగ్గర ఉన్న బంగారం, బంగారు నగలు స్వామికి సమర్పిస్తారు. తమ భక్తికి గుర్తుగా చేస్తారు. పూణెకు చెందిన ఈ కుటుంబం ఒక స్పెషల్ కారులో తిరుపతికి వచ్చారు. ఆ కారును బంగారు పూతతో చాలా అందంగా డిజైన్ చేశారు. అది కూడా తిరుమలలో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. వీళ్లు గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. పేరుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కొంతమంది ఇలా షో చేయడం ద్వారా మీకేం వస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది వెంకటేశ్వర స్వామి తో సమానంగా వీరు కూడా నగలు వేసుకోవాలని ప్రయత్నించారేమో అని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: