ఘాటైనా విమర్శలతో జగన్ ను నట్టేటా ముంచేసిన 'అంబటి' రాంబాబు!?
* వెటకారపు మాటలకు బ్రాండ్ అంబాసిడర్ గా ముద్ర..!
* పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ఘటైనా విమర్శలే ఓటమికి కారణం.!
(ఏపీ-ఇండియాహెరాల్డ్ ): ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘెర ఓటమిని చవిచూసింది.వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర భారీ విజయం సాధించడంతో 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అన్నట్లుగా అధికారం చేపట్టిన అయిదేళ్లకే జగన్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయి,ఆయన మంత్రివర్గం పై ప్రజలకు విసుగొచ్చి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీను గద్దె దించారు. వైసీపీ,తీవ్ర ప్రజాగ్రాహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది.2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు సైతం బద్దలయ్యాయి. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లను కూడా ఆ పార్టీ సాధించలేకపోయింది.ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నప్పటికి , కూటమి ప్రభుత్వం ఆయన్ను పట్టించుకోవడం మానేసింది.ఇంతటి ఘోర పరాభవానికి కారణాలు లెక్కలేనన్ని ఉన్నాయి.అయితే వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆ పార్టీకి చెందిన మంత్రులు, ముఖ్యనేతలు వాడిన భాష. అది వైకాపా పట్ల ప్రజల్లో చులకన భావం కలిగేలా చేసింది. రాజకీయ ప్రత్యర్థుల్ని ఆగర్భ శత్రువుల్లా చూడటం, రాయలేని రీతిలో తిట్టించడాన్ని వారి పనితీరుకు కొలమానంగా వైకాపా అగ్రనాయకత్వం భావించింది.ముఖ్యంగా, తమ పార్టీ అధినేత జగన్ దృష్టిలో పడేందుకు, బాధ్యత గల పదవుల్లో ఉన్న మంత్రులు నోరు పారేసుకున్నారు వారిలో ఒకరు సంబరాల రాంబాబుగా గుర్తింపు పొందిన అంబటి రాంబాబు.
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు అడిగే ప్రశ్నలకు హుందాగా సమాధానం చెప్పాల్సిన వాళ్లు.. ప్రతిపక్ష నేతలపై ఇష్టారీతిన బూతు పురాణంతో విరుచుకుపడ్డారు. ప్రజలు వినలేని, రాయలేని పదాలతో తిట్టిపోశారు. అసభ్య పదజాలం వాడితేనే తమ అధిష్ఠానం వద్ద మార్కులు పడతాయని భావించారు. పార్టీ అధినేత మనసెరిగిన కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వారి స్థాయిని, హోదాను మర్చిపోయారు. శాసనసభలో ఉన్నామా, బహిరంగ సభలో మాట్లాడుతున్నామా అన్నది కూడా చూసుకోకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని దారుణమైన బూతులు తిట్టించడం పరిపాటిగా మారింది. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వైకాపా మంత్రులు వ్యవహరించారు. శాసనసభ ప్రతిష్ఠను మంటగలిపారు. నిండు సభలో చంద్రబాబుపై కొందరు వైకాపా ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీస్తూ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.పవన్‌కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి సీఎం జగన్ సహా మంత్రులు పదేపదే వ్యాఖ్యలు చేశారు. మూడు పెళ్లిళ్లంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు కుటుంబంతో పాటు పవన్‌పై వైకాపా నేతలు వాడిన భాష ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఒకానొక సందర్భంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ తీసిన సినిమాల పేర్లను ఉపయోగించి మారుపేర్లతో వ్యంగంగా మీడియాతో మాట్లాడడం జరిగింది. అదే వీటన్నిటిని గమనిస్తున్న ప్రజలు రాజకీయాలను వ్యక్తిగతంగా ముడి పెట్టొద్దని ఎలాగైనా సరే వైసిపి మంత్రుల తీరులను తప్పుపట్టారు.
వైసీపీ ప్రభుత్వంలో జల వనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అప్పటి మంత్రి అంబటిరాంబాబు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పలు అంశాలపై అప్పట్లో ఆయన్ని మీడియా ప్రశ్నిస్తే అన్ని విషయాలూ నాకు తెలియాలని రూల్ ఏమీ లేదని ,మీకు అన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదని అన్నారు.అప్పట్లో ఎప్పుడూ అంబటి రాంబాబు, పోలవరం ప్రాజెక్టు గురించి ప్రెస్ మీట్ పెట్టింది లేదని ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే దాంట్లోపవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మరియు ఆయన సినిమాలకి రివ్యూలు కూడా ఇచ్చేవారు.చూడటానికి పెద్దమనిషిలా హుందాగా కనిపించే అంబటి రాంబాబుకి సత్తెనపల్లి టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్న జగన్ ఆయనకు నీటి పారుదల శాఖ మంత్రి పదవి కూడా గౌరవించారు. అలాంటి పెద్ద మనిషి పోలవరం గురించి మీడియా అడిగితే కాఫర్ డ్యామ్ అసలు అవసరమా అని,రిటైనింగ్ వాల్ గురించి నన్ను అడుగుతారేంటీ ఏంటూ మీడియానే వెటకారం చేస్తూ ఎదురు ప్రశ్నిస్తారు. సొంతల్లుడే మా మావయ్య ఓ లోఫర్ అంటూ వీడియోలు చేసి పెట్టినా పండుగలు వేస్తూ చాలా డ్యాన్స్ చేస్తూ వైరల్ అవటం,ఫోన్స్ కాల్స్ లో టాలెంట్ చూపిస్తూ అడ్డంగా దొరికిపోయి పార్టీకి డ్యామేజ్ చేయటం తప్ప నమ్మిన జగన్ కు అలాగే వైసీపీపార్టీకు ఓటు బ్యాంక్ మేనేజ్ చేసింది మాత్రం శూన్యమని ప్రజలు డిసైడ్ చేశారు అందుకే ఎన్నికల్లో ఓటమి చూపించారు. ఈ ఎన్నికల్లో దాని ప్రభావం ప్రజా తీర్పు రూపంలో స్పష్టంగా వెల్లడైంది. బూతుల్లో ఆరితేరిన వారంతా నేడు ఓటమి పాలయ్యారు.మొత్తంమీద వైకాపాలోని బూతు మంత్రులకు ఏపీ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన చందంగా తీర్పునిచ్చారు.