ఏపీలో హీటెక్కిస్తున్న రాజకీయాలు.. ఇకనైనా మారరా..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కిస్తున్నాయి. ఇటీవలే జరిగిన కొన్ని తాజా పరిణామాల వల్ల టిడిపి వైసిపి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. వైసిపి పైన ఆరోపణలు ఎంత స్థాయిలో చేస్తూ ఉంటే అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తూ ఉన్నప్పటికీ ఆరోపణలు రోజురోజుకి ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇటీవలే అత్యాదాడులు హింసాత్కమైన ఘటనలు కూడా పొలిటికల్ హీట్ ని పెంచేస్తున్నాయి. ఎలాంటి చిన్న దాడి జరిగిన సరే అవి రాజకీయ వైపు గానే వెళుతున్నాయి. ఇలా ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ఇదే వైసీపీ మధ్య కూటమి సర్కార్ మధ్య ఒక వార్ గా ముదురుతున్నది.. కూటమి నేతలు వాగ్దానాలు నెరవేర్చకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విధంగా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే ప్రతిపక్ష నేతల పైన కేసులు పెట్టడంపై ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమ మీద పెట్టిన ఎలాంటి కేసులోనైనా కూడా ఎదుర్కొంటామని తప్పు చేయకపోయినా ఇలాంటి కక్ష పూరితమైన రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే గతంలో మీరు చేసింది ఏంటి అంటూ కూడా పలువురు కూటమినేతలు వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఎక్కడ ప్రభుత్వ ఫైల్స్ దగ్ధమైన కూడా కేవలం ప్రతిపక్ష పార్టీల చేశాయనే  ఆరోపణలు చేయడమే కాకుండా..అందుకోసం ఉద్యోగులను కూడా సస్పెండ్ చేస్తున్నారని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి కూడా ఆగ్రహాన్ని తెలిపారు. ఇలా ఒక్కొక్కరుగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారనే విధంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఏపీ హోమ్ మంత్రి అనిత ఎలాంటి కక్షలు లేవు ప్రతికారాలు లేవని ఆంధ్రాలో శాంతిభద్రతలు అదుపు తప్పించడానికి వైసిపి నాయకులు చేస్తున్నారనే విధంగా ఆరోపణలు చేస్తోంది. ఇలా ఆరోపణలు, ప్రత్యేకరోపణలు ఎలాంటివి జరిగినా కూడా రాజకీయంగానే మారుతోంది. మరి ఇక మీదట ఆయన ఇలాంటివి జరగకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకట్టు వేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: