కొడాలి నాని ని కాపాడుతున్న జూనియర్ ఎన్టీఆర్.. !
పైగా కొడాలి నాని పై కేసులు పెట్టాలంటే చాలా సెక్షన్లు వాడుకోవచ్చు, ఇందుకు ప్రత్యేకంగా ఎలాంటి కారణాలు వెతకాల్సిన అవసరం లేదు, గుడివాడలో వరుసగా జరిగిన కేసినో వ్యవహారం చాలు.. చేతికి మట్టి అంటకుండా కొడాలి నానిని జైలుకు పంపించవచ్చు. కానీ.. కూటమి పార్టీ వచ్చి రెండు నెలలు అయింది. ఇప్పటివరకు కొడాలి నాని పై ఎలాంటి ? చర్యలు తీసుకోలేదు. పైగా వల్లభనేని వంశీ పై ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి.. వంశీని ఎప్పుడు ? అరెస్టు చేయాలా అని ఆలోచన చేస్తున్నారు. మరి నాని విషయంలో ఎందుకు చర్యలు ? తీసుకోవడం లేదు అంటే.. దీని వెనక ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. కొడాలి నాని పై కేసు పెట్టి జైలుకు పంపిస్తారని తెలుగు తమ్ముళ్లు కూడా కోరుకుంటున్నారు.
ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అనే చర్చ టిడిపిలో నడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కొడాలి నాని కి ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఎన్టీఆర్.. కొడాలిని కాపాడుతున్నారనేది తమ్ముళ్లు చెబుతున్న మాట. ఎన్టీఆర్ డైరెక్ట్‌గా కాకపోయినా.. లోకేష్‌కు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు నాయకులు ద్వారా.. జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని తెరవెనక మంత్రంగం నడుపుతూ.. కొడాలి నానిని కాపాడేలా చక్రం తిప్పుతున్నట్టు తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయం పూర్తిగా బయటికి వస్తే పార్టీలో తీవ్ర ఆగ్రహావేశాలు కచ్చితంగా వస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.