కర్నూలు టీడీపీ నేత హత్య కేసులో ఆ పార్టీ నాయకుడే నిందితుడు.. హత్యకు కారణాలివే!
గతంలో నర్సింహులు సీఆర్పీఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేసి ఆ తర్వాత వీ.ఆర్.ఎస్ తీసుకున్నారని సమాచారం అందుతోంది. వాకిటి శ్రీనివాసులు గతంలో ఒక సందర్భంలో గుడిసె నర్సింహులును చెప్పుతో కొట్టాడని ఆ కోపంతోనే ఈ హత్య జరిగిందని సమాచారం అందుతోంది. వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్ శ్రీనివాసులుకు దక్కుతుందనే ప్రచారం నర్సింహులును ఎంతగానో బాధ పెట్టింది.
హత్య కేసులో దోషి టీడీపీ నేత అని తేలడంతో లోకేశ్ ఎలా రియాక్ట్ అవుతారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యా రాజకీయాలు జరుగుతుండటం ఒకింత సంచలనం అవుతోంది. రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు రిపీట్ కాకుండా ఎలాంటి చర్యలు చేపడతారనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. నారా లోకేశ్ సైతం ఈ తరహా ఘటనలకు పార్టీ కార్యకర్తలు పాల్పడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ నేతలు ఈ ఘటన విషయంలో టీడీపీని టార్గెట్ చేస్తూ ఒకింత ఘాటుగా స్పందిస్తున్నారు.