ఏపీ: దేవాన్ష్ నాయకత్వంలో పనిచేస్తానంటున్న టీడీపీ నేత ..!

FARMANULLA SHAIK

తెలుగు సినిమా పరిశ్రమలోకి పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను సొంతం చేసుకున్న అతడు.. మధ్యలో పరాజయాలు ఎదురైనా 'టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి కొన్నేళ్లుగా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. దీంతో యమ జోష్‌తో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ముఖ్య నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి మాదిరిగా ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు. కానీ, అతడి పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతడి పేరును వైసీపీ వాళ్లు మాత్రం పెద్దగా వాడుకోవడం లేదు.జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకున్నా పేరు హాట్ టాపిక్ అవుతూనే ఉంటోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు అతడిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అందులోనూ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బుద్దా వెంకన్న అయితే ఎన్టీఆర్‌ను బాగా టార్గెట్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సార్లు కాంట్రవర్శీ కామెంట్లను చేశాడు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను టీడీపీలోనే కొనసాగుతాను. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ నాయకత్వంలో పని చేయడానికి సిద్దం. కానీ, ఎన్టీఆర్‌కు సపోర్ట్ చేయను' అని పేర్కొన్నారు.ఇదే ఇంటర్వ్యూలో బుద్దా వెంకన్న కొనసాగిస్తూ.. 'ఆయన నందమూరి తారక రామారావు గారి మనవడే. కానీ, ఆయన లాంటి మనవళ్లు చాలా మందే ఉన్నారు. లోకేష్ కూడా ఎన్టీఆర్ గారి మనవడే. ఆయన పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పని చేయలేదా' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా వెంకన్న చేసిన వ్యాఖ్యలపై తారక్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.చాలా ఏళ్ళు గా టిడిపికి సంబంధం లేదన్నట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్నారని,  ఇప్పుడు వెంకన్న చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తున్నారు .అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చి,  ఆయనపై విమర్శ చేయడం అంతిమంగా టిడిపికే ఎక్కువ నష్టం చేకూరుస్తుంది తప్ప,  లాభం ఏమి ఉండదు.  ఈ విషయాన్ని గ్రహించకుండానే పదేపదే జూనియర్ ఎన్టీఆర్ ను విమర్శించే విధంగా టిడిపి నాయకులు ప్రవరిస్తున్న తీరు,  చేస్తున్న కామెంట్స్ తిరిగి ఆ పార్టీకి డామేజ్ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: