బొత్స విజయంతో మండలిలో అలా జరగనుందా.. గీత దాటితే కూటమికి చుక్కలే!

Reddy P Rajasekhar
ఏపీ ఎన్నికల ఫలితాలు వైసీపీ శ్రేణులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ పుంజుకునే అవకాశం కూడా లేదని చాలామంది భావించారు. వైసీపీలో జగన్ మినహా ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న కీలక నేతలెవరూ లేకపోవడంతో రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు ఏంటనే చర్చ సైతం మొదలైంది. అయితే బొత్స విజయంతో లెక్కలు మాత్రం ఒక్కసారిగా మారిపోయాయనే చెప్పాలి.
 
వైసీపీలో నూతనోత్సాహాన్ని బొత్స విజయం నింపిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. బొత్స సత్యనారాయణ చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోయినా విశాఖ స్థానిక ప్రతినిధుల ఎమ్మెల్సీగా ఎన్నికై వార్తల్లో నిలిచారు. బొత్స సత్యనారాయణకే అనుకూలంగా ఫలితం రానుందని క్లారిటీ రావడంతో అధికారంలో ఉన్నప్పటికీ కూటమి సైతం వెనుకడుగు వేసింది. పోటీ చేసి ఓడిపోతే పార్టీ పరువు పోతుందని చంద్రబాబు భావించారు.
 
పార్టీ అధికారంలోకి వచ్చిన రెండో నెలలోనే వ్యతిరేక ఫలితాలు రావడం సరికాదని ఆయన ఫిక్స్ అయ్యారు. చంద్రబాబు వెనుకడుగు వైసీపీలో జోష్ నింపడంతో పాటు రాబోయే రోజుల్లో వైసీపీ స్థాయి పెరగనుందని క్లారిటీ వచ్చేసింది. శాసన మండలిలో కూటమి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తే ఆ నిర్ణయాలకు చెక్ పెట్టేలా బొత్స అడుగులు ఉండనున్నాయి.
 
బొత్స సత్యనారాయణ గెలుపుతో కూటమికి ఒక విధంగా కష్టాలు మొదలైనట్టేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బొత్స సత్యనారాయణ గెలుపును అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. వైసీపీ ఫిరాయింపులను సైతం బొత్స సత్యనారాయణ ఆపేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. బొత్స సత్యనారాయణ గెలుపు జగన్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం జగన్ నెక్స్ట్ లెవెల్ వ్యూహాలతో ముందుకు రానున్నారని సమాచారం అందుతోంది. వైసీపీ అద్భుతమైన వ్యూహాలతో ముందుకెళ్తే ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: