అభివృద్ధికి అడ్డు ప్రజలే.. విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే..?

Divya
•అభివృద్ధికి ఆటంకం ప్రజలే..
•సంక్షేమ పథకాలకు ఆశపడి ఓటు దుర్వినియోగం
•ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అలా చేయాల్సిందే..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
2019 ఎన్నికలలో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఏకంగా 175 స్థానాలలో పోటీ చేస్తే, 151 స్థానాలు కైవసం చేసుకొని , రికార్డు సృష్టించారు. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని పలు రకాల నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా దాదాపు రూ40వేలకు పైగా ఆర్థిక సహాయం అందించారు. ఇదే ఆయన అభివృద్ధి నాశనానికి కారణం అయ్యింది.
ప్రజలు డబ్బుకు అలవాటు పడిపోయారు. ఎవరు డబ్బు ఇస్తే వారి వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అంటూ ప్రజలకు డబ్బు వెదజల్లారు. కానీ యువత , రాజకీయ విశ్లేషకులు ఇదే పెద్ద తప్పు అంటూ హెచ్చరించారు అయినా సరే ఆయన పట్టించుకోలేదు. ఫలితంగా 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూటమి తరపున అధికారంలోకి వచ్చారు. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలతో మళ్ళీ అధికారం చేపట్టారు. ఈ పథకాలే నష్టాన్ని కలిగిస్తున్నాయి.  ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ప్రజలే అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తున్నారు అంటే వారికే మొగ్గుచూపుతున్నారు. వారి వల్ల మనకు అభివృద్ధి జరుగుతుందా లేదా అనే విషయాలు మరిచిపోతున్నారు.
అందుకే డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే, ఎవరు పథకాలను అందుబాటులోకి తీసుకొస్తే వారికే తమ ఓటు అంటూ పవిత్రమైన విలువైన ఓటును దుర్వినియోగం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది , వడ్డీలు కట్టడానికి సరిపోవడం లేదు అంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పథకాల పేరిట ప్రజలు ఆశపడడం అభివృద్ధికి ఆటంకం అయితే మరొకవైపు ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిరుత్సాహపరిచే అంశాలను పదేపదే చెప్పడం కూడా అభివృద్ధికి ఆటంకం అనే చెప్పాలి. ఇక ఇవన్నీ మానుకుంటేనే అభివృద్ధి కలుగుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: