ఏపీ అభివృద్ధిని ముంచేస్తున్న ప్రధాన నేతల పంతం.. ప్రజలు నష్టపోతున్నారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఏవనే ప్రశ్నకు టీడీపీ, వైసీపీ పేర్లు సమాధానంగా వినిపిస్తాయి. అయితే ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో తీసుకుంటున్న నిర్ణయాలే రాష్ట్ర అభివృద్ధిని ముంచేస్తున్నాయి. టీడీపీ హయాంలో వచ్చి కంపెనీలు, పెట్టుబడులు పెట్టిన సంస్థలను వైసీపీ ఇబ్బందులు పెడితే వైసీపీ పాలనలో ప్రాధాన్యత దక్కిన కంపెనీలకు టీడీపీ హయాంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
 
ఇలా పార్టీలు మారిన ప్రతిసారి ప్రాజెక్ట్ లు, పథకాలు, కంపెనీలకు సంబంధించి ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ లో సైతం ఇలాంటి పరిస్థితి మారాలని నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
అయితే ప్రధాన పార్టీల నేతలు ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంతిమంగా నష్టపోతున్నది ప్రజలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఏపీ పాలకులు ఇందుకు సంబంధించి మారాల్సి ఉంది. ప్రజాధనం వృథా అయ్యే నిర్ణయాల విషయంలో ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
ఏపీ ఎంత వేగంగా అభివృద్ధి చెందితే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని చెప్పవచ్చు. ఏపీలో ఎక్కువ సంఖ్యలో వైట్ కాలర్ జాబ్స్ కల్పించాలని నిరుద్యోగులలో చాలామంది కోరుకుంటున్నారు. ఉచిత పథకాల కంటే రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని ప్రజలు చెబుతుండగా ఏపీ పాలకులు ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. ఏపీ పాలకుల ఆలోచనా తీరు మారాల్సి ఉందని మరి కొందరు చెబుతున్నారు. ఏపీ పాలకులు ఇదే విధంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. చంద్రబాబు, జగన్ లకు ఏపీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఈ ఇద్దరు నేతలను అభిమానించే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: