తెలుగు పొలిటికల్ ట్రోలింగ్ : తడబడ్డ సైబరాబాద్ మొక్క అంటూ.... అడ్డంగా బుక్ అయినా రజిని..!

FARMANULLA SHAIK
* మహాత్ముడికి 70 ఏళ్ళ జయంతి శుభాకాంక్షలు తెల్పిన తీరు..!
* ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బిల్పై చర్చ సమయంలోనూ..
* సైదరాబాద్ లో నాటిన మొక్కని నేనూ...అనడంలో
2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ భారీ విజయంతో అధికారం చేపట్టిన సంగతి తెల్సిందే. అయితే అధినేత జగన్మోహనరెడ్డి అలాంటి విజయాన్ని సాధించడంలో కీలకమైన రోల్ ప్లే చేసింది జగన్ పాదయాత్ర ఘట్టం.అధికారం చేపట్టిన తర్వాత అప్పటి సీఎం జగన్ మంత్రులను ఎన్నుకునేటప్పుడే వాళ్ళకి క్లారిటీ ఇచ్చేసారు. మొదటి రెండున్నారేళ్లు మాత్రమే వారు మంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని తర్వాత రెండున్నారేళ్లు వేరేవాళ్లకి అవకాశం ఇస్తానన్నారు. అలాంటిది గుంటూరు జిల్లా నుండి ఎమ్మెల్యేగా మొదటిసారి గెల్చి మంత్రి అయినా విడుదల రజని ఆరోగ్య శాఖా మంత్రిగా జగన్ బాధ్యతలు అప్పగించారు.అయితే ఒకానొక సందర్భంలో మంత్రి విడుదల రజిని సోషల్ మీడియా వేదికగా బాగా ట్రోల్ల్స్ కి గురి అయ్యారు.
రజిని విషయానికి వస్తే రాజకీయాల్లో రజిని ఎంట్రీ కోసం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తన శిష్యురాలుగా మహానాడు సభలో చంద్రబాబుకు పరిచయం చేశారు. ఆ సభ లో రజిని తన వాక్చతుర్యంతో చంద్రబాబు గారి కళ్ళలో పడి మంచి భవిష్యత్తు ఆమెకు ఉంది అనేలా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ రోజు ఆమె ఆ సభలో మాట్లాడిన తీరు చంద్రబాబు గారిని ఉద్దేశించి మీరు నాటిన సైబారాబాద్ చెట్టు మొక్కని నేను అంటూ అదరగొట్టిన స్పీచ్ కొన్నాళ్ళకు బాగా ట్రోల్ కి గురి అయింది. కొన్ని అంతర్గత కారణాల వల్ల ఆమె టీడీపీ నుండి వైసీపీలోకి చేరి జగన్ మంత్రం తపించెటపుడు టీడీపీ నేతల భయంకర ట్రోల్స్ ఎదురుకుంది.గత ప్రభుత్వంలో జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు పై  చర్చ విషయంలో అప్పటి వైద్య శాఖ మంత్రి విడుదల రజిని వైయస్సార్ గురించి మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. వైయస్సార్ అంటేనే తెలుగు ప్రజలకు ఆత్మీయత అని,  ఒక మానసిక భావనా అని అన్నారు. ఒక మనిషి శాసిస్తే గాడితప్పిన ఒక రాష్ట్రం పట్టాలెక్కుతుంది అనడానికి బదులు 'పట్టలేకపోతుంది ' అని అన్నారు.తడబడిన తరువాత మరోసారి ఆ పదాన్ని సవరించుకొని ఒక మనిషి మరణిస్తే ఆ వార్తను తట్టుకోలేక వందలాది మంది మరణిస్తారు అంటే అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైయస్సార్ అని ఆమె వ్యాఖ్యానించారు.
అయితే మాజీ మంత్రి విడుదల రజిని ఆ విధంగా టంగ్ స్లిప్ అవడం అనేది అది మొదటిసారి ఏం కాదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.గతంలోనూ ఆమె ఒకసారి మాట తడబడ్డారు.గతంలో ఎక్సైజ్ పాలసీ, గ్రామ సచివాలయ వ్యవస్థ పై  మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... గాంధీజీ 150 జయంతి నీ పురస్కరించుకుంటూ గాంధీ అంశాన్ని ప్రస్తావిస్తూ పొరపాటున గాంధీజీ జన్మించి 70 సంవత్సరాలు అయ్యిందన్నారు. 150 వ జయంతి అని చెప్పిన ఆమె వెంటనే...70యేళ్ళు అనడంతో తేడా కొట్టేసింది. అదేంటి 150వ జయంతిని పట్టుకొని 70 ఏళ్ళు అంటారా అంటూ సోషల్ మీడియాలో రజనీని టార్గెట్గా చేసి రోలింగ్ చేశారు అప్పట్లో అది ఒక వైరల్ గా మారింది.కానీ ప్రస్తుతం ఏపీలో అధికారం మారడంతో ఫైర్ బ్రాండ్ గా పేరూపొందిన వైసీపీ నాయకులందరు గప్ చుప్ సాంబార్ బుడ్డి అనేలా ఎవరికి వారు సైలెంట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: