తప్పులో కాలేసి నారా లోకేశ్ నోరు జారిన సందర్బాలివే.. తొందరపాటు వల్లే అలా మాట్లాడారా?

Reddy P Rajasekhar
ఏపీ మంత్రి నారా లోకేశ్ పాలిటిక్స్ పరంగా ఎదిగిన తీరును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు. నారా లోకేశ్ కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండగా ఈ ఎన్నికల్లో లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిగా కూడా పని చేస్తున్నారు. అయితే కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగిన లోకేశ్ గతంలో పలు సందర్భాల్లో తాను చేసిన కామెంట్స్ వల్ల ట్రోల్స్ కు గురైన సందర్భాలు సైతం ఉన్నాయి. తప్పులో కాలేసిన లోకేశ్ పై పలు సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వచ్చాయి.
 
చంద్రబాబు గతంలో జైలు ఉన్న సమయంలో లోకేశ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి చంద్రబాబు చేసిన అన్యాయాన్ని వివరిస్తామంటూ నోరు జారారు. ఆ సమయంలో రోజా లోకేశ్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం జరిగింది. మరోవైపు నారా లోకేశ్ ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ఒక బాలుడు చనిపోతే ప్రైవేట్ పాఠశాల పైకప్పు అని కామెంట్లు చేయడం జరిగింది. మరో సందర్భంలో లోకేశ్ ప్రతి నెలా అమ్మఒడి ఇస్తానంటూ నోరు జారి వార్తల్లో నిలిచారు.
 
300 రూపాయల పింఛన్ ను 400 రూపాయలు చేస్తామంటూ నారా లోకేశ్ చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. నారా లోకేశ్ అంతఃకరణ శుద్ధి అనే పదాన్ని సరిగ్గా పలకలేదని కూడా ఆయనపై ట్రోల్స్ వచ్చాయి. గతంలో లోకేశ్ తెలంగాణలో వర్తించని కోడ్ ఏపీలో మాత్రమే వర్తిస్తుందా అని కామెంట్స్ చేశారు. అయితే ఆ సమయంలో తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగుతుండటంపై విమర్శలు వచ్చాయి.
 
2012లో వాజ్‌పేయ్ గారు భారత రాష్ట్రపతిగా ఎవర్ని పెట్టాలని అడిగిన సమయంలో చంద్రబాబు అబ్దుల్ కలాం గారి పేరును ప్రతిపాదించారని లోకేశ్ ఒక సందర్భంలో కామెంట్స్ చేశారు. అయితే లోకేశ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం, తొందరపాటు వల్లే అలా మాట్లాడారని చాలామంది ఫీలవుతారు. అయితే నారా లోకేశ్ ఇప్పుడు మాత్రం వివాదాలకు తావివ్వకుండా మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టులు చేస్తూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: