ఏపీ సిఎం గా చంద్రబాబు అరుదైన రికార్డ్.. ఎవరు చెరపలేరా..?

Divya
నరేంద్ర మోడీ దేశంలో జవహర్లాల్ నెహ్రూ రికార్డును తిరగరాస్తున్నారా అంటే కాదు కానీ.. ఆయనతో సమానంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 11 వ సారి జాతీయ పతాకాన్ని ఎగరవేయబోతున్నారు ప్రధానమంత్రి మోడీ.. ఒక రికార్డు ఏమిటంటే కాంగ్రెస్ ఏతర ప్రధాని 11 సార్లు ఎర్రకోట మీద జాతీయ పతాకాన్ని ఎగరవేసినటువంటి రికార్డు ఆయనదే. అది ఓకే అయితే కాంగ్రెస్లోని ప్రధాన మంత్రులకు ఎవరికీ సాధ్యం కానటువంటి ఇంక్లూడింగ్ ఇందిరాగాంధీతో సహా ఒక జవహర్లాల్ నెహ్రూ కి మాత్రమే సాధ్యమైంది.. అది కూడా మొట్టమొదటి నామినేటెడ్ ప్రైమరీ , ఆ తర్వాత ఎలక్ట్రిక్ ప్రైమరీ అయ్యారు

అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు రికార్డు అయితే నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా మారిపోయింది. బాబు భవిష్యత్తులో  కూడా అసాధ్యమేమో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు గతంలో 14 సార్లు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఇప్పుడు 15వసారి జాతీయ పతాకాన్ని ఎగరవేయబోతున్నారు. ఏ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇన్నిసార్లు జాతీయ పతాకాన్ని ఎగరేసినటువంటి ఆ అవకాశం రాలేదు ఇవ్వలేదు.. తద్వారా ఆంధ్రప్రదేశ్లో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రికార్డును చేరుకోవాలంటే సుమారుగా 20 30 ఏళ్లు పైనే పడుతుంది.

చంద్రబాబు నాయుడు రికార్డ్ అయితే సమీపంలో కూడా ఎవరు కనిపించడం లేదు.. తద్వారా చంద్రబాబు రికార్డు అనేటువంటిది భారీ స్థాయి రికార్డు అని చెప్పవచ్చు. రాబోయే నాలుగేళ్లలో కూడా మళ్లీ చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఎగురవేసే అవకాశం ఉంటుంది కనుక ఈ రికార్డును చెరిపేయడానికి ఏ నేతలకు సాధ్యం కాదని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే సీఎం చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉన్నారు.. కూటమిలో భాగంగానే అన్ని అమలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు. ఈ రోజున అన్న క్యాంటీన్లు మొదలు పెట్టబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: