ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శ్రీ వల్ల చాలామంది పేద ప్రజల సైతం బాగుపడిన సందర్భాలు ఉన్నాయి. గత వైసిపి ప్రభుత్వం దాదాపుగా 25 లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చును సైతం ప్రభుత్వమే భరిస్తుందంటూ పెంచడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయునన్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా పెండింగ్ ఉన్న బకాయిల సైతం చెల్లించడానికి రేపటి రోజే చివరి రోజుగా డెడ్లైన్ విదించారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్.

దీంతో ఆగస్టు 15వ తేదీ నుంచి రోగులకు ఎలాంటి ఆరోగ్యశ్రీ సేవలు సైతం కొనసాగించలేమంటూ తెలియజేశారు. ఈ రోజున ఆ విషయాన్ని సైతం ప్రభుత్వానికి వివరిస్తూ ఒక లెటర్ ని కూడా రిలీజ్ చేశారట. 2023 సెప్టెంబర్ తర్వాత బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయని సుమారుగా 2500 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 160 కోట్లు మాత్రమే చెల్లించాలని.. దీనివల్ల ఆసుపత్రులకు రోజువారి ఖర్చులకు కూడా డబ్బులు లేవంటూ తెలుపుతున్నారు.

నెట్వర్క్ హాస్పిటల్ లో సుమారుగా 1500 కోట్ల రూపాయలకు పైగా ఆరోగ్యశ్రీ బిల్లుల సైతం పెండింగు ఉన్నాయని ఎనిమిది నెలల నుంచి అసలు ఏ ఒక్క బిల్లు కూడా చెల్లింపు చేయలేదు ప్రభుత్వం అంటూ ఆంధ్ర స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ తెలుపుతున్నారు. ఆరోగ్యశ్రీని నిలిపివేయబోతున్నట్లుగా ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వైరమేష్ తో పాటు అవినాష్ ప్రకటనలో తెలియజేశారు.. అలాగే ఉద్యోగుల ఆరోగ్య భీమా కింద కూడా కొత్త కేసులోనూ కూడా తీసుకోబోమంటూ స్పష్టం చేశారు. అటు ప్రైవేటు వైద్య కాలేజీలలోను ఆరోగ్య సేవలు కొనసాగించమంటూ కూడా ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు తెలియజేశాయి. ఈ మేరకు సేవలు కొనసాగించలేమంటూ కూడా ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చేస్తే ఇకమీదట ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ సేవలు నడవడం కష్టమే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: