వైసీపీ చేదు: పార్టీకి తలనొప్పిగా మారిన నేతల ఇల్లీగల్ ఎఫైర్స్...!

FARMANULLA SHAIK
* మూలిగే నక్కపై తాటాకు పడ్డట్టు వైసీపీ పరిస్థితి.!
* పార్టీని నిలబెడదామనే లోపే కిందికి లాగుతున్న నేతలు.!
* కూటమి కంటే సొంత నేతలే ఇబ్బందిగా మారేనా.?

(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గత వారం రోజుల నుండి హాట్ హాట్ గా రోజుకో ట్విస్ట్ తో సినిమాను తలపిస్తున్న అంశం దువ్వాడ శ్రీనివాస్.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను ఒకాటా ఆడుకుంటుంది అని ప్రజలు భావిస్తే ప్రజల ఊహలకి అందని విధంగా వైసీపీ నేతలే స్వయం అపరాధంతో వాళ్ళకి వాళ్లే అడ్డంగా బుక్ అవుతున్నారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రంలో రచ్చ రచ్చ చేస్తున్న కుటుంబ కధాచిత్రం దువ్వాడ ఫ్యామిలీ. అయితే శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో దువ్వాడ కుటుంబం ఒకటి. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్‌ తండ్రివైపు నుంచి ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదు ఆయన తండ్రి ఒక సాధారణ రైల్వే ఉద్యోగి అయితే ఆయన అత్తింటి వారు తొలి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. దువ్వాడ వాణిని వివాహం చేసుకున్నాకే దువ్వాడ రాజకీయాల్లోకి వచ్చారు జిల్లాలో కీలక నేత అయిన దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి కుటుంబానికి తొలి నుంచి ప్రత్యర్థిగా దువ్వాడ మామ సంపతిరావు రాఘవరావు రాజకీయాలు చేస్తూ వచ్చారు.దువ్వాడ శ్రీనివాస్‌.. మొన్నటి వరకూ వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్‌. గత ఎన్నికల్లో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పెళ్లిళ్ల అంశంపై తరచూ స్పందించి ఓ దశలో వివాదాస్పదంగా మారారు. ఇటీవల ఇంట్లో జరుగుతున్న
గొడవలతో దువ్వాడ సతమతం అవుతున్నారు. మాధురి అనే మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ శ్రీనివాస్ సతీమణి వాణి ఆరోపణ.. తర్వాత మాధురి స్పందన.. అనంతరం పరిణామాలు.. దువ్వాడను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తనను అభాసుపాలు చెయ్యాలనే భార్యా పిల్లలు పనికట్టుకుని రభస చేస్తున్నారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు.
దాంతో MLC దువ్వాడ శ్రీనివాస్ భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. ఓ వైపు ఫ్యామిలీ గొడవలతో సతమతం అవుతున్న దువ్వాడను కనీసం అధిష్టానం పట్టించుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది.దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారాన్ని కేవలం భార్యా భర్తల వివాదంగా తేల్చి చెప్పింది వైసీపీ. భార్యాభర్తల వివాదంలో చలికాచుకోవడానికి సిగ్గులేదా అంటూ టీడీపీకి కౌంటర్  పోస్ట్ వేసింది. వైసీపీ ఎంత సైలెంట్ గా ఉన్నా.. పదే పదే ఈ విషయంలో రెచ్చగొట్టి చివరకు అటు నుంచి పోస్ట్  పడేలా చేసింది టీడీపీ. భార్యా భర్తల వివాదంలో చలికాచుకోడానికి సిగ్గులేదా అంటూ వైసీపీ పెట్టిన పోస్టింగ్ ని తిరిగి వారికే రివర్స్ లో తగిలిస్తున్నారు టీడీపీ నేతలు. గతంలో పవన్ కల్యాణ్ వ్యవహారంలో చలికాచుకోవాలనుకున్నది ఎవరని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద దువ్వాడ ఫ్యామిలీ మేటర్.. టీడీపీకి చెలగాటం, వైసీపీకి ప్రాణ సంకటంలా మారింది.గతంలోనూవిజయసాయిరెడ్డి,శాంతి ఇష్యూలో వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకోలేదు. ఫ్యామిలీ మ్యాటర్స్, వివాహేతర సంబంధాల విషయంలో.. జోక్యం చేసుకుంటే పార్టీ పరువు పోతుందన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనే MLC అనంతబాబుకు మద్దతు ఇచ్చి దెబ్బతిన్నామని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు.. దువ్వాడ MLC రద్దు చేయాలని ఆయన సతీమణి వాణి డిమాండ్‌ చేస్తున్నారు.
దాంతో మూలిగే నక్క మీద తాటిపండు పడటం అంటే ఇదే అనేలా ఏపీ చరిత్రలో దారుణమైన ఓటమితో కుమిలిపోతున్న వైసీపీ అధినేత జగన్ కు వరుసగా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి.ముఖ్యంగా పార్టీలో కీలక నాయకులంతా రకరకాల వివాదాల్లో వారికీ వారే చిక్కకోవడం పార్టీ అధినేతకు తలనొప్పిలాగా మారింది.వారు చేసిన లేదా చేస్తున్న అతి వేషాలతో పార్టీ పరువు తీస్తున్నారు. ఆ పార్టీలో ఉన్న వాళ్లంతా ఆ బాపతు గాళ్లే అని జనం నవ్వుకోవడంతో వైసిపి అండ్ జగన్ గ్రాఫ్ మరింత దిగజారిపోతుంది.అందుకే ఈరోజో రేపో దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా అనే అంశంపై అధినేత  జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.దాంట్లో భాగంగానే దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది.అధికారంలో వుండగా వైసీపీ మంత్రుల భాగోతాలు, ప్రభుత్వం పోయాక విజయసాయిరెడ్డి - శాంతి ఘటన, తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ ఘటన, కాకినాడ నుంచి ద్వారంపూడి రాసలీలలు, మరోవైపు సజ్జల రాసలీలలు.. ఇలా వరుస ఘటనలతో ఉక్కిరి బిక్కిరి అయిన జగన్ దువ్వాడ శ్రీనివాస్‌ని బయటకి తరమడం ద్వారా పార్టీ నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని భావించినట్టు తెలుస్తోంది. ఘోర ఓటమి నుంచి కోలుకోకముందే వైసీపీ నాయకులు వరుసగా లైంగిక నేరాల్లో ఇరుక్కుంటూ వుండటంతో మన పార్టీకి ఇదేమి ఖర్మ అంటూ వైసీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: