రోడ్డు మార్గాలు: అభివృద్ధి దిశగా ఆంధ్ర.. అమరావతిలో మరో రెండు కొత్త మార్గాలు..!

Divya
•ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యం..
•అభివృద్ధి దిశగా అమరావతి అడుగులు ..
•ఇప్పటికే పనులు ప్రారంభం..
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి చేసే పనిలో పడ్డ కూటమి అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే వివిధ ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లే ప్రయాణాన్ని సుగమం చేయడానికి ప్రయాణ దూరాన్ని తగ్గించడం కోసం రెండు కొత్త రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయబోతోంది. అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిని చెన్నై - కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానం చేయడం కోసం సిఆర్డిఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాజధాని ప్రాంతంలో మరో రెండు రహదారులను కూడా నేషనల్ హైవేకి అనుసంధానించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు రాజధాని లోని ఈ 11 ఈ 13 రోడ్లను కూడా NH -16  కి అనుసంధానం చేసే విధంగా కసరత్తులు మొదలుపెట్టింది ప్రభుత్వం. రాజధాని అమరావతిని చెన్నై, కోల్కతా నేషనల్ హైవే - 16 తో అనుసంధానం చేస్తూ మొత్తం మూడు రోడ్లను అభివృద్ధి చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆలోచిస్తోంది. అందులో భాగంగా నే అక్కడ భూముల సేకరణ కూడా చేపట్టినట్లు సమాచారం. గతంలో రూపొందించిన రాజధాని ప్రధాన మౌలిక వసతుల ప్రణాళిక ప్రకారం ఒక సీడ్ యాక్సిస్ రోడ్డు (E-3)ను మాత్రమే మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో కలుపునున్నారు.
అలాగే తూర్పు నుంచి పడమర కి , ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రీడ్ విధానంలో రూపొందించారు .తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు E-1 నుంచి ఈ E-16 వరకు అలాగే ఉత్తరం E-1 నుంచీ E-18 వరకు ఉన్నాయి వాటిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కి E-3 రోడ్డు నెంబర్ను కేటాయించారు. ఈ రోడ్డును ముందుగా 21.278 కిలోమీటర్ల పొడవున నిర్మించాలనుకున్నారు దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 18.270 కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా బ్యారేజీ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 3.08 కిలోమీటర్లు రెండో ప్యాకేజీగా నిర్మించాలని అనుకున్నారు.  మొదటి ప్యాకేజీ పనులు దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు 14 కిలోమీటర్ల మేర పూర్తి అయ్యాయి. గత ఏడు సంవత్సరాలుగా రాజధానికి ఈ మార్గంలోనే రాకపోకలు సాగుతున్న విషయం తెలిసిందే. మరొకవైపు ఎన్.హెచ్16 నుంచి మంగళగిరి ఎయిమ్స్ కి కొండల పక్క నుంచి ఒక రహదారి నిర్మించారు. వీటికి భూసేకరణ సమస్యలు లేవు కాబట్టి ఈ మార్గం త్వరగా పూర్తిచేయాలని భావిస్తోంది సి ఆర్ డి ఏ. త్వరలోనే ఈ కొత్త రహదారులను ఏర్పాటు చేసి ప్రయాణ సమయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: