కొత్త తెలుగు రహదారులు: ఔటర్ రోడ్డుకు భారీ ప్లాన్..హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలు ?
* RRR రోడ్డుతో భూముల ధరలకు రెక్కలు
* 10 రెట్లు పెరుగనున్న హైదరాబాద్
* రూ. 26 వేల కోట్లతో నిర్మాణం
* 350 కిలోమీటర్ల పొడవుతో rrr రోడ్డు
హైదరాబాద్ మహానగరం.. దేశంలోనే పాపులర్ అయిన పట్టణం. హైదరాబాద్ మహానగరాన్ని దేశానికి రెండవ రాజధానిగా చేయాలని కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. గతంలో బెంగళూరు.. పట్టణం చాలా పాపులర్ గా ఉండేది. కానీ బెంగళూరు ను హైదరాబాద్ దాటేసి చానా రోజులు అవుతుంది. అయితే అలాంటి విశ్వనగరం హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఉన్న సంగతి తెలిసిందే.
ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పూర్తయింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత... హైదరాబాద్ చుట్టూరా రీజనల్ రింగ్ రోడ్... రాబోతుంది. దాదాపు 350 కిలోమీటర్ల పొడవు తో నాలుగు లైన్లతో ఈ... రీజినల్ రింగ్ రోడ్ నిర్మించబోతోంది ప్రభుత్వం. మొదట ఈ త్రిబుల్ ఆర్ రోడ్డుకు 17 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసుకున్నారు.
కానీ అంచనా తలకిందులైంది. ఈ రోడ్డు అంచనాలు 26 వేల కోట్లకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు.. నిర్మించబోతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ రోడ్డు రెండు భాగాలుగా చేస్తున్నారు. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు విజయవాడ జాతీయ హైవేను కలుపుతూ 160 కిలోమీటర్ల వరకు ఉత్తర ప్రాంతం ఉండబోతుంది.
ఇక దక్షిణ భాగంలో.. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు అంటే దాదాపు 170 కిలోమీటర్ల వరకు నిర్మించబోతున్నారు. ఇక ఈ రింగ్ రోడ్డు.. శాటిలైట్ సిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం చుట్టూ ఏర్పడే ఈ శాటిలైట్ నగరాలలో రియల్ ఎస్టేట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ రోడ్డుకు ఇరువైపులా ఫ్యాక్టరీలు అలాగే ల్యాబ్లు కూడా వస్తాయి. హైదరాబాద్ మహానగరం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి.