తె(లు)గులు మీడియా : ఎన్టీవీ న్యూస్ ఛానెల్... పదహారేళ్ళ ప్రయాణంలో సాధించిన లక్ష్యం అదేనా..?

FARMANULLA SHAIK
* స్టోరీ బోర్డు పేరుతో రాజకీయాంశాల విశ్లేషణ.!
* 2009 ఎన్నికల ఫలితలా సర్వేలో రికార్డ్..!
* మనదేశం-మనగీతంతో మరో కీలక మెట్టు.!
(ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-ఇండియా హెరాల్డ్ ): ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ఏ రకంగా అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని ప్రభావం చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఒకవైపు మంచిని ప్రోత్సహిస్తూనే మరోవైపు చెడుకి దారితీస్తుంది.ఒకప్పుడు దేశంలో ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందంటే అది ప్రజలకు చేరాలంటే బాగా సమయం పట్టేది కానీ ప్రస్తుత రోజుల్లో ప్రపంచంలో ఏ మూలాన ఏం జరిగిన మరుక్షణం మన కళ్ళ ముందే జరుగుతుందన్నట్లుగా మీడియా అభివృద్ధి చెందిది.మీడియా అంటే కేవలం ఒక రంగానికే పరిమితం కాకుండా వివిధ రూపాల్లో విస్తరించింది. ఒకవైపు పత్రిక రంగంగా,సోషల్ మీడియాలాగా మరోవైపు న్యూస్ ఛానల్ రూపంలో సమాచారాన్ని వేగంగా ప్రజల వద్దకు చేర్చడంలో ఒక మీడియం లాగా వ్యవహారిస్తుంది.
మీడియాలో భాగంగా చాలా వరకు అన్నీన్యూస్ ఛానెల్స్ మంచి విశ్వసనీయమైన సమాచారం అందించలానే లక్ష్యంతో వచ్చినప్పటికి ప్రస్తుత రోజుల్లో  రాజకియనాయకుల చేతుల్లో నలిగి పోతుంది అనడంలో ఆశ్చర్యం లేదు.దేశంలో ఎక్కడైనా ఏ ఛానలైనా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం తప్పటంలేదనే సంగతి కూడా ప్రజలకి అర్ధం అయింది. అయితే ఏపీ విషయానికి వస్తే న్యూస్ ఛానెల్స్ రేటింగ్స్ లో టాప్ లిస్ట్లో ఉన్న వాటిలో టీవీ-9,ఈటీవీ,Ntv,సాక్షి,టీవీ-5,ABN,... లాంటి ప్రముఖ ఛానెల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ ఛానెల్స్ అన్నీ రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ చేతుల్లో బందీ అయిపోయి ఆ పార్టీకే మద్దతుగా చెప్పడం వల్ల ప్రజల్లో విశ్వాసనీయత కోల్పోయే సందర్భాలు ఉన్నాయి.అయితే అలాంటి న్యూస్ ఛానెల్స్ లో ఒకటైన Ntv గూర్చి ఈరోజు ప్రజల మనసులో ఆ ఛానెల్ గూర్చి ఏమనుకుంటున్నారో అనేదే ఈ ఆర్టికల్ సారాంశం. విషయానికి వస్తే తుమ్మల నరేంద్ర చౌదరిచే 2007 సంవత్సరంలో స్థాపించబడిన భారతీయ తెలుగు భాషా వార్తా ఛానల్ Ntv.ఈ ఛానెల్‌కు డైరెక్టర్గా నరేంద్ర చౌదరిగారు, మేనేజింగ్ డైరెక్టర్గా తుమ్మల రమాదేవిగారు వ్యవహారిస్తున్నారు.NTV యొక్క మాతృ సంస్థ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా భక్తి టీవీ, వనిత టీవీ కూడా కలిగి ఉన్నారు.Ntv ఛానెల్ ప్రతి క్షణం ప్రజా హితం అనే ట్యాగ్ లైన్తో మీడియా రంగంలో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వైసీపీ పార్టీకి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నట్లు ప్రజలల్లో ఒకరకమైన సందేశాన్ని చెప్పకనే చెప్పింది.ఏపీలో గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన సపోర్ట్ పూర్తిగా వైసీపీ కి ఇచ్చి ప్రతిపక్ష పార్టీ ఐనా టీడీపీ,జనసేనను తీవ్ర స్థాయిలో విమర్శించింది అని ప్రజల్లో ఒక ముద్ర వేసుకున్నట్లు సమాచారం.ప్రజలలో ఇంకొన్ని వర్గాల్లో Ntv గూర్చి అనుకునేది ఏంటంటే అధికారపక్షంలో ఏ పార్టీ ఐతే ఉందొ ఆ పార్టీకి కొమ్ముకాస్తుంది అనే అభియోగం కూడా ఉంది.కాకపోతే ఈ న్యూస్ ఛానెల్ డైరెక్ట్గా ఆ పార్టీకి ఈ పార్టీకి మద్దతు అనేది ఎక్కడ కనబడకుండా మేనేజ్ చేసుకుంటా వస్తుంది.ఐతేనేం ప్రజాక్షేత్రంలో మాత్రం Ntv అనేది వైసీపీకి ఫేవర్ అనే టాక్ వినబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ntv

సంబంధిత వార్తలు: