ఆ తప్పు వల్లే ఏపీలో ఇసుక బాధలు .. టీడీపీ సర్కార్ జాగ్రత్త పడాల్సిందే!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కష్టాలు కొనసాగుతున్నాయనే సంగతి తెలిసిందే. ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ప్రాంతాలలో భవన నిర్మాణ కార్మికులు ఖాళీగా ఉంటూ ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఉచిత ఇసుకను త్వరగా ప్రకటించడం వల్లే ఈ కష్టాలు మొదలయ్యాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
గత నెల రోజులుగా ఇసుక దొరక్కపోవడం సర్వ సాధారణం అయిపోయింది. ఇసుక పాయింట్ల దగ్గర ఉన్న ఇసుక అంతా ఇప్పటికే ఖాళీ అయిపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై స్పందిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వర్షాల వల్ల ప్రస్తుతం నదుల నుంచి సినిమాలు తీసే అవకాశం అయితే కనిపించడం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
 
ఉన్న కొద్దిపాటి ఇసుక ప్రముఖులకే తప్ప సామాన్యులకు దక్కడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బ్లాక్ లో మాత్రమే ఇసుక దొరుకుతుందని చాలామంది భవన నిర్మాణ కార్మికులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కోస్తా జిల్లాలలో ఇప్పట్లో ఇసుక దొరికే పరిస్థితి కనిపించడం లేదు. గ్రౌండ్ లెవెల్ లో ప్రజలు కూటమి పాలనపై కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
పథకాల అమలు అంతకంతకూ ఆలస్యం కావడంపై కూడా కూటమి సర్కార్ పై ఒకింత వ్యతిరేకత ఏర్పడుతోంది. వర్షాకాలం తర్వాత ఉచిత ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చి ఉంటే బాగుండేది. ప్రభుత్వం మారిన ప్రతి సందర్భంలో భవన నిర్మాణ కార్మికులకు కష్టాలు వస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇసుక కష్టాలకు రాబోయే రోజుల్లో అయినా పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి. ఇసుక కష్టాల వల్ల ఉపాధి కోల్పోతున్న పరిస్థితి నెలకొందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఇసుక కష్టాలను వీలైనంత వేగంగా పరిష్కరంచే దిశగా అడుగులు వేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: