హిండెన్ బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ రియాక్షన్ ఇదే.. కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Reddy P Rajasekhar
హిండెన్ బర్గ్ సెబీ ఛైర్ పర్సన్ పై తాజాగా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ సెబీ ఛైర్ పర్సన్ మాధవి పురి బచ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. హిండెన్ బర్గ్ అందరూ ఊహించిన విధంగానే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచడానికి ఉపయోగించిన మారిషస్ ఫండ్ లో మాధవి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపణలు చేయడం గమనార్హం.
 
విజిల్ బ్లోయర్ నుంచి తమకు ఇందుకు సంబంధింహిన సమాచారం అందిందని హిండెన్ బర్గ్ పేర్కొంది. గతంలో కూడా హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిండెన్ బర్గ్ ఆరోపణల గురించి సెబీ స్పందించాల్సి ఉంది. హిండెన్ బర్గ్ ఆరోపణల గురించి అదానీ గ్రూప్ రియాక్ట్ అయింది. హిండెన్ బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించడం గమనార్హం.
 
గతంలో సైతం హిండెన్ బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని అదానీ గ్రూప్ వెల్లడించింది. మా హోల్డింగ్ మొత్తం పారదర్శకంగా ఉందని చెబుతూ అదానీ గ్రూప్ పేర్కొంది. పబ్లిక్ డాక్యుమెంట్లలో సంబంధిత వివరాలు క్రమం తప్పకుండా బహిర్గతం చేస్తూనే ఉన్నామని అదానీ గ్రూప్ వెల్లడించింది. అదానీ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తులను లేదా మా స్థితిని కించపరచడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు చేస్తున్నారని సంస్థ వెల్లడించింది.
 
అదానీ గ్రూప్ ప్రతినిధి మాట్లాడుతూ భారతీయ చట్టాలను పూర్తిగా ధిక్కరించేలా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సెబీ చీఫ్ సైతం హిండెన్ బర్గ్ ఆరోపణలపై స్పందించారు. గతంలో హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలను సైతం తీవ్రంగా ఖండిస్తున్నామని సెబీ చీఫ్ వెల్లడించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని సెబీ చీఫ్ పేర్కొన్నారు. అవసరమైన అన్ని విషయాలను ఇప్పటికే సెబీకి అందించామని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: