మాధురి కారు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్...కావాలనే చేసుకుందా !?
ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది మాధురి కారు. ఈ సంఘటన లో మాధురికి గాయాలు అయ్యాయని పోలీసులు గుర్తించారు. దివ్వెల మాధురి కారుకు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే.. ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా కారు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్ దగ్గర ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే.. దివ్వెల మాధురి కారుకు రోడ్డు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్ - దివ్వల మాధురి వ్యవహారం రచ్చ జరుగుతున్న తరుణంలోనే.... మాధిరి ఆక్సిడెంట్ కు ప్రాధాన్యత చోటు చేసుకుంది. దువ్వాడ వాణి కుటుంబం టార్చర్ భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నానని వెల్లడించారు దివ్వల మాదిరి. ఈ ప్రమాదంలో తను చనిపోతే.. దువ్వాడ వాణి పైనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దివ్వల మాదిరి.. హైవేపై సూసైడ్ చేసుకునేందుకే పలాస బయలుదేరాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దివ్వల మాదిరి.
తన పిల్లలు బాధ తట్టుకోలేక... హైవేపై సూసైడ్ చేసుకునేందుకే పలాస బయలుదేరాను అని తెలిపారు దివ్వెల మాధురి. తనకు ట్రీట్‌మెంట్ చేయకండి అంటూ ఆందోళన చేస్తున్నారు దివ్వెల మాధురి. పిల్లల్ని ట్రొల్ చేయటంతో చనిపోవాలనుకున్నాను..... మానశికం గా ఎంత దైర్యంగా ఉండాలనుకున్నా... పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ అనటంతో తట్టుకోలేక పోయాను అంటూ వ్యాఖ్యానించారు.