దివ్వెల మాధూరి..ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో,మెయిన్ మీడియాలో హైలెట్ అవుతున్న పేరు.. టెక్కలి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని దువ్వాడ భార్య,కూతుర్లు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వీరి గురించి ఎన్నో వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అలాగే వీరి వ్యవహారంలో మీడియా అయితే పండగ జరుపుకుంటుంది. వీరి వ్యవహారం రోజురోజుకు ముదురుతున్న వేళ తాజాగా దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది. మరి ఆమెకు ఏమైనా గాయాలు అయ్యాయా..ఈ కారు ప్రమాదం వెనుక ఎవరి కుట్రనైనా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం.. దువ్వాడ శ్రీనివాస్ ని ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ మా ఇంట్లో ఉంటుంది అంటూ దువ్వాడ వాణి,ఇద్దరు కూతుర్లు ఆరోపిస్తున్నారు. కానీ మాధురి మాత్రం ఆయన దగ్గర ఆస్తులు లాక్కోవడానికి ఏమీ లేవు.
నా డబ్బులే ఖర్చు పెట్టే ఆయనకు ఎలక్షన్స్ లో సహాయం చేశాను.దాదాపు రెండు కోట్ల వరకు నేను ఆయనకు ఎలక్షన్స్ లో ఇచ్చాను. అలాగే ఆయనకు అన్ని రకాలుగా సహాయం చేస్తున్నాను. రెండు సంవత్సరాలు నుండి లేని భర్త,తండ్రి ఇప్పుడే వచ్చాడా.. ఇన్ని రోజులుగా ఒక్కసారైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏం తిన్నావు అని వాళ్ళు అడిగారా.. ఇప్పుడు సడన్ గా ఎలా ఊడిపడ్డారు అంటూ లైవ్ లోనే తిట్టింది. అంతేకాకుండా వాణి మాధురి ముగ్గురు పిల్లలకు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే వాళ్ళు ఎవరికి పుట్టారో తెలుస్తుంది అని షాకింగ్ కామెంట్లు చేయడంతో ఆమె మాటలకు ఫైర్ అయిన మాధురి ముందు నీ ఇద్దరు కూతుర్లకు డిఎన్ఏ టెస్ట్ చేయించు, ఆ తర్వాత నేను నా కూతుర్లకు నేను డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాను. నీకు ఇది సవాల్ విసురుతున్నాను. ఇంకొకసారి అలాంటి మాటలు అంటే చెప్పుతో కొడతాను. తంతాను అంటూ మాట్లాడింది.
ఇలా వీరి వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. అయితే ఓ పక్క మీడియాలో మాటలు యుద్ధం నడుస్తూ ఉంటే మరో పక్క దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైంది అనే వార్త మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా దివ్వెల మాధురి పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న కారుని దమాధురి కారు ఢీకొనడంతో ఆ కారులోనే ఉన్న మాధురి తీవ్ర గాయాలపాలైంది. దాంతో మాధురిని వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ కారు ప్రమాదం మాధురి టెక్కలి నుండి పలాస వెళుతున్న రోడ్డు మార్గంలో జరిగిందట. దాంతో ఈ యాక్సిడెంట్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కొంతమంది మాధురి సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన మాధురి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది