ముస్లింల భూముల అంశం.. మోదీ వెనక్కుతగ్గక తప్పలేదా?

Chakravarthi Kalyan
వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డు బిల్లును జేపీసీకి పంపాలని నిర్ణయించింది. విపక్షాల డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా పార్లమెంట్ సమావేశాల్లో వక్ప్ బోర్డు సవరణ బిల్లును కేంద్ర మంత్రి రిజిజు ప్రవేశ పెట్టారు. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేయడంతో పాటు ముస్లిం మహిళలను సభ్యులుగా చేసేలా సవరణలు చేశారు.

ఈ వక్ఫ్ బిల్లుకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో తప్పిన పరిస్థితుల్లో పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపడానికి అంగీకరించింది. కారణమేదైనా అభ్యంతరాలు వ్యక్తం అయినప్పుడు జేపీసీకి లేదా సెలక్ట్ కమిటీకి పంపండం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక సంప్రదాయం. కానీ ఎన్డీయే అధికారంలోకి వచ్చాక కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే దీనిని పాటించింది. పదేళ్లనాడు గద్దెనెక్కగానే అంతకు ముందు కొన్ని నెలల ముందు అమల్లోకి వచ్చిన భూసేకరణ చట్టం పీక నొక్కుతూ ఆదరాబాదరాబగా ఆర్డినెన్స్ తీసుకురావడం ఎవరూ మర్చిపోరు.
అయితే మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జేపీసీకి అంగీకరించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే , తృణమూల్ కాంగ్రెస్ తో పాటు వైసీపీ కూడా వ్యతిరేకించింది. ఇక దీనిని జేపీసీకి పంపాలని ఎన్డీయే భాగస్వామి అయిన టీడీపీ సూచించింది.

ఈ మేరకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. దీంట్లో అధికార, విపక్షాలకు చెందిన 21 మంది ఎంపీలను రిజిజు ప్రతిపాదించారు. ఈ కమిటీలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి చోటు దక్కింది.  ఇక తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, శ్రీకృష్ణ దేవరాయలకు చోటు దక్కింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తో పాటు మరికొందరిని ఎన్నుకున్నారు. రాజ్యసభ నుంచి కూడా పది మంది పేర్లను సిఫార్సు చేయాలని పెద్దల సభను కిరణ్ రిజిజు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: