ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసిన లక్ష్మీపార్వతి ప్రేమ.. ఆమె తప్పు లేదు కానీ?

Reddy P Rajasekhar
దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదనే సంగతి తెలిసిందే. నటుడిగా, రాజకీయ నేతగా ఆయన మంచి పేరును సొంతం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ సాధించిన సంచలన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన ప్రతిభ ఆయన సొంతమని చెప్పవచ్చు.
 
తెలుగు వాళ్లు అన్నగారు అని పిలుచుకునే సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఏకంగా 303 సినిమాలలో నటించారు. రోజుకు మూడు షిప్ట్ లలో పని చేసి మెజారిటీ సినిమాలతో విజయాలను అందుకున్నారు. మూడు దఫాల పాటు ఏడేళ్లు ఎన్టీఆర్ సీఎంగా పని చేయడం జరిగింది. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ ను లక్ష్మీపార్వతి ప్రేమ నాశనం చేసిందని విశ్లేషకులు భావిస్తారు. లక్ష్మీపార్వతితో ప్రేమ వల్లే అందరివాడు అయిన ఎన్టీఆర్ కొందరివాడు కావాల్సి వచ్చింది.
 
ఎన్టీఆర్ కు, నాకు మధ్య ప్రేమ చిగురించిందని అయితే ప్రేమ ఎప్పుడు చిగురించిందో చెప్పలేనని లక్ష్మీపార్వతి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. 1989 ఎన్నికల్లో ఓటమిపాలు కావడం వల్ల ఎన్టీఆర్ బాధ పడుతున్న సమయంలో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు అండగా నిలబడటంతో వాళ్లిద్దరి మధ్య అనుబంధం పెరిగింది. తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు.
 
అయితే ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి లక్ష్మీపార్వతి జోక్యం ఎక్కువైందని జరిగిన ప్రచారం ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బందిగా మారింది. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు ప్రకటించి 1995లో చంద్రబాబును సీఎం చేశారు. ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో ఎన్టీఆర్ ఎంతో బాధ పడ్డారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉంది. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి ప్రేమ, పెళ్లి ఎన్నో వివాదాలకు కారణమంది. అయితే లక్ష్మీపార్వతి తప్పు లేదని వాదించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: