ఏపీ: ఆ విషయంలో కర్ణాటక సీఎంను ఒప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరియు ఇతర కీలక శాఖల బాధ్యతలు చేపట్టి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటూనే ప్రజల సమస్యలు తీర్చడంలో ఎక్కువ సమయాన్ని కేటాయీస్తున్నారు.ప్రస్తుతం రైతుల పొలాల సమస్యపట్ల భాగంగానే కర్ణాటక సీఎం సిద్ధారామయ్యను  కలవడానికి గురువారం ఉదయం బెంగుళూరుకు చేరుకొని మర్యాదపూర్వకంగా ఆయనను  కలిశారు.ఈ సందర్భంగా సీఎం సిద్ధూకు పుష్పగుచ్చాలు ఇచ్చారు. అలాగే కర్నాటక ప్రభుత్వం తరపున కూడా పుష్పుగుచ్ఛం ఇచ్చిన సీఎం సిద్ధూ.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను అభినందించారు.అయితే వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు.దాంట్లో చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల బీభత్సం సృష్టించి, ఆస్థి, ప్రాణ నష్టం చేస్తున్న క్రమంలో ఏనుగుల మందలను తరిమేందుకు, కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను పంపించాలని కర్ణాటక రాష్ట్ర ఫారెస్ట్మినిస్టర్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు.ఏపీలో అందుబాటులో కేవలం రెండు కుంకీ ఏనుగులే ఉన్నాయని అవి ఏనుగుల గుంపును తరమడానికి సరిపోవడం లేదని అన్నారు.అలాగే పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్రచందనం దోపిడీని అరికట్టేందుకు ప్రణాళిక రచించనున్నారు పవన్. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కలిసి పని చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు పవన్ కళ్యాణ్.దాంట్లో భాగంగానే కర్ణాటక ఫారెస్ట్ శాఖ మంత్రి ఈశ్వర్ బి. ఖంద్రేతో భేటీ అయ్యారు. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని, ప్రాణ హాని కలిగిస్తున్నాయని, ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని బి. ఖంద్రేకు తెలిపారు. ఈ కుంకీ ఏనుగులు కర్ణాటక అటవీ శాఖ పరిధిలో ఉన్నాయని, కొన్ని కుంకీ ఏనుగులు ఏపీకి ఇవ్వాలని మంత్రిని కూడా పవన్ కల్యాణ్ కోరారు. దీనిపై కర్ణాటక అటవీ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: