రాయలసీమ: మదనపల్లి కేసు పై.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రియాక్షన్..!

Divya
కూటమిలో భాగంగా రాజకీయ కక్ష సాధింపులు చేస్తున్నారంటూ వైసీపీ మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు.. నిన్నటి రోజున ఆయన మీడియా తో మాట్లాడుతూ మదనపల్లె ఫైల్స్ కాలిపోవడం పైన కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని కేవలం తనపైన ఆరోపణలు చేస్తున్నారని ఆధారాలు చూపించాలంటూ కూడా ఒక సవాల్ నీ ఏపీ ప్రభుత్వానికి విసిరారు.. చంద్రబాబు నాయుడు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేకంగానే ఉంటున్నారంటూ తెలియజేశారు. తాము అధికారంలోకి ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష సాధింపులకు పాల్పడలేదని కూడా తెలియజేశారు.

ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీల పైన దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారని తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. నిజాలతో సంబంధం లేకుండా తమ క్యారెక్టర్ లను సైతం దెబ్బతీసే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు తమ అనుకూల మీడియా పత్రికలలో కూడా అవాస్తవాలను రాయిస్తున్నారు అంటూ వాపోతున్నారు.. తనలాంటి వాళ్ల పైన దాడులు చేయిస్తున్నారు తమ కుటుంబం పైన అనవసరంగా కూడా ఆరోపణలు చేస్తున్నారు అంటూ తెలిపారు. ఇక తమ ఆస్తుల వివరాలను కూడా ఎన్నికల అఫీడవిట్లో తెలియజేశాము అంటూ తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

కొన్ని చానళ్లు అత్యుత్సాహంతో తమ క్యారెక్టర్ ను భంగం కలిగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు.వీటి పైన కచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. హామీలను నెరవేర్చలేక ఏపీ సీఎం ఇలాంటి అడ్డదారుల పాలిటిక్స్ చేస్తున్నారట తెలిపారు .సూపర్ సిక్స్ అంటే భయపడుతున్నారని ఖజానాలో కాళీ అయ్యిందని సాకులు వెతుక్కుంటున్నారు అంటు పెద్దిరెడ్డి తెలిపారు. మదనపల్లి కేసును సిబిఐడి కి అప్పగించిన సిబిఐకి ఇచ్చినా కూడా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ఆ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలిపారు. వైసిపి నాయకుల పైన కేసు వేసి కేవలం వారిని వేదించడమే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పెట్టుకుంది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: